Two Ben stokes at ground Viral video : ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఓ ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఇద్దరు బెన్‌స్టోక్స్ కనిపించారు. ఇది చూసిన తర్వాత.. అభిమానులు మాత్రమే కాకుండా, ఇటీవల రిటైర్ అయిన జేమ్స్ ఆండర్సన్ కూడా నమ్మలేకపోయాడు. ఇకపోతే మ్యాచ్ నాలుగో రోజు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ కొనసాగుతోంది. ఈ సమయంలో కెమెరామెన్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ రూపాన్ని ప్రేక్షకుల మధ్య గుర్తించాడు. ఆ తర్వాత ఇద్దరినీ కలిపి చూపించడం మొదలుపెట్టారు. ఇది చూసిన అండర్సన్, స్టోక్స్ వైపు చూడడంతో అక్కడ అతనికి నవ్వు తెప్పించింది.
SBI SO 2024: స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థులను కోరుతున్న ఎస్బిఐ..
ఇంగ్లండ్ కెప్టెన్ అతని రూపాన్ని చూసిన వెంటనే మొదట అతను తన కళ్లను నమ్మలేకపోయాడు. దాంతో అతను స్టాండ్‌లో కూర్చున్న తన రూపాన్ని చూసి ఫన్నీగా స్పందించాడు. నవ్వుతూ తన వేళ్ళతో ఒక సంకేతం చేసి కళ్లపై పెట్టుకున్నాడు. ఇది చూసి పక్కనే కూర్చున్న అండర్సన్ కూడా నవ్వడం మొదలుపెట్టాడు. ఈ సమయంలో వ్యక్తి కూడా తెరపై తనను తాను చూసి ఆశ్చర్యపోయాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఓవర్ లోనే ఒక వికెట్ కోల్పోయింది. అయితే, దీని తర్వాత బెన్ డకెట్, ఆలీ పోప్ ఇన్నింగ్స్‌ను కనసాగిస్తున్నారు. డకెట్ కేవలం 59 బంతుల్లో 71 పరుగులు చేయగా, పోప్ 121 పరుగులు చేశాడు. అనంతరం స్టోక్స్ అర్ధ సెంచరీతో ఇంగ్లండ్ 416 పరుగులు చేసింది.
Kalki 2898 AD 25 Days: ఓరి దేవుడా.. అప్పుడే 25 రోజులయ్యిందా..?
దీనికి ధీటుగా స్పందించిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసి 41 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇందులో క్వెమ్ హాడ్జ్ (121), అలిక్ అథానాజే (82), జాషువా డి సిల్వా (82) పరుగులు చేశారు. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 425 పరుగులు చేసింది. దీంతో 384 పరుగుల ఆధిక్యం సంపాదించి పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రస్తుతానికి ఛేజింగ్‌లో వెస్టిండీస్ 7 వికెట్ల నష్టానికి 113 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో ఉంది.
There's only one thing better than one Ben Stokes… Two Ben Stokes. 👨🦰👨🦰 pic.twitter.com/SGV941zDew
— England Cricket (@englandcricket) July 21, 2024