NTV Telugu Site icon

Villagers Attack : బీభత్సంగా కొట్టుకున్న రెండు వర్గాలు.. ఆపుదామకున్న పోలీసులకు గాయాలు

Church Attack Bastar

Church Attack Bastar

Villagers Attack : మతమార్పిడి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఘర్షణను ఆపేందుకు వెళ్లిన పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలోని బస్తర్‌లో జరిగింది. బలవంతపు మతమార్పిడులను వ్యతిరేకిస్తూ ఒక చర్చిపై దాడికి స్థానికులు ప్రయత్నించారు. అడ్డుకునే యత్నంలో ఒక పోలీస్‌ అధికారి గాయపడ్డారు. నారాయణపూర్‌లో బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా ఆదివాసీ వర్గం సోమవారం సమావేశమైంది. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య పెద్ద వాగ్వాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల వారు ఒకరిపై మరొకరు ఘర్షణకు దిగారు. తొలుత కుర్చీలు, రాళ్లు విసురుకున్నారు. అనంతరం కర్రలతో కొట్టుకున్నారు. చుట్టూ కుర్చీలు, రాళ్లు విసిరి కొట్టారు. కాసేపటికే అది పూర్తి స్థాయి పోరుగా మారింది.

Read Also: Russia-Ukraine War: రష్యాను చావుదెబ్బ కొట్టిన ఉక్రెయిన్.. మిస్సైళ్లతో దాడి.. 400మంది మృతి

ఈ సందర్భంగా విశ్వ దీప్తి క్రిస్టియన్ స్కూల్ ప్రాంగణంలోని చర్చిపై దాడికి ఒక వర్గం ప్రయత్నించింది. మరోవైపు సమాచారం అందుకున్న నారాయణపూర్‌ ఎస్పీ సదానంద్, పోలీస్‌ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. స్థానికులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి కర్రతో దాడి చేయడంతో ఆయన తలకు గాయమై రక్తం కారింది. దీంతో ఎస్పీ సదానంద్‌ కుమార్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ ప్రాంతానికి అదనపు పోలీసులను తరలించారు. నిరసనలు, ఘర్షణలను నివారించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులు మధ్యాహ్నం విశ్వ దీప్తి క్రిస్టియన్ స్కూల్ సమీపంలోకి వచ్చి పాఠశాల ఆవరణలో ఉన్న చర్చి వైపుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తుండగా ఎవరో తన తలపై కర్రతో కొట్టారని ఎస్పీ సదానంద్‌ కుమార్‌ తెలిపారు.

Read Also: Power outage at Airport: ఎయిర్ పోర్టుకు పవర్ కట్.. నిలిచిన 282విమాన సర్వీసులు

Show comments