NTV Telugu Site icon

Gang Rape: మహిళా స్వీపర్‌పై గ్యాంగ్ రేప్.. ఐదుగురు అరెస్ట్

Gang Rape

Gang Rape

Gang Rape: ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్న దళిత మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలు కాంట్ పోలీస్ స్టేషన్‌పై కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన సమాచారం మేరకు.. మహిళ తనకు తెలిసిన యువకుడిని కలిసేందుకు వెళ్లినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతని స్నేహితుడు, అతని సహచరులు మహిళపై అత్యాచారం చేశారు. ఈ సంఘటన పోలీస్ స్టేషన్ కాంట్ పరిధిలో జరిగిందని, ఈ విషయం రెండు వారాల నాటిదని మధువన్ సింగ్ సిటీ అయోధ్య ఎస్పీ తెలిపారు.

Govinda Namalu: శనివారం గోవిందనామాలు వింటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి..

బాధితురాలు సెప్టెంబర్ 2న కాంట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. దింతో అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తన స్నేహితుడిని వివిధ తేదీలలో కలవడానికి వెళ్ళినప్పుడు ఆమె స్నేహితుడు, అతని సహచరులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని., అందుకు సంబంధించి విచారణలో ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మిగితా వారి కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతోంది. సంబంధంలో ఉన్న తన స్నేహితుడు, అతని సహచరులు తనపై అనేకసార్లు సామూహిక అత్యాచారం చేశారని, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి, వివిధ ప్రదేశాల్లో తనపై చాలా రోజులు అత్యాచారం చేశారని మహిళ ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్ 2న నివేదిక సమర్పించగా.. మీడియాకు దూరంగా ఉండాలని పోలీసులు ఆమెను, ఆమె కుటుంబానికి తెలిపారు.

Sumibora : ఆన్‌లైన్ స్టాక్‌ ట్రేడింగ్‌ స్కామ్‌లో సినీనటి అరెస్ట్..

నేను శ్రీరామ జన్మభూమిలో పనిచేస్తున్నానని, ఈ ఘటన తర్వాత నా పని కూడా కోల్పోయానని బాధితురాలు చెప్పింది. బాధితురాలు తనకు ఒక అబ్బాయితో స్నేహం చేసిందని, ఆ తర్వాత వారు సంబంధం పెట్టుకున్నారని, అయితే ఆ అబ్బాయి అకస్మాత్తుగా తన స్నేహితులతో మాట్లాడటం ప్రారంభించాడని., అలాగే నేను పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు నా తలపై కూడా గాయపడ్డానని చెప్పింది. దాని వల్ల నేను స్పృహ తప్పాను. ఆ వ్యక్తులు తనతో తప్పుడు పనులు చేశారు. సాయంత్రం స్పృహలోకి వచ్చేసరికి వంశ్ చౌదరి, వినయ్ అనే ఇద్దరు అబ్బాయిలు మాత్రమే ఉన్నారు. దీని తర్వాత, వారు నన్ను గెస్ట్ హౌస్ నుండి గ్యారేజీకి తీసుకెళ్లారు. అక్కడ కూడా వారు నాపై అత్యాచారం చేసి నా వీడియో తీశారు. దీంతో అతను నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ఆ వ్యక్తులు నన్ను బ్లాక్ మెయిల్ చేసేవారని, తనకు పదే పదే కాల్ చేశారని బాలిక తెలిపింది. భయంతో ఈ విషయాన్ని ఇంట్లో కానీ, పోలీసులకు కానీ చెప్పలేదు. మళ్లీ 22న జన్మభూమికి వచ్చి ఆ తర్వాత 22 నుంచి తన వద్దే ఉంచుకుని 24వ తేదీ రాత్రి వదిలేశారని మహిళ తెలిపింది

Show comments