NTV Telugu Site icon

IND vs AUS: తీరుమారని టీమిండియా.. 150కే ఆలౌట్

Ind Vs Aus

Ind Vs Aus

IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో నేడు మొదటి మ్యాచ్ పెర్త్‌లో మొదలయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్ లో నితీష్ రెడ్డి 41 పరుగులతో జట్టు టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆస్ట్రేలియా తరపున జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ మొదలైనప్పటి నుండి ఆస్ట్రేలియా జట్టు డామినేషన్ క్లియర్ గా కనపడింది. భారత ఇన్నింగ్స్ ఆడడానికి వచ్చిన యశస్వి జైస్వాల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. దీని తర్వాత, దేవదత్ పడిక్కల్ కూడా నంబర్-3లో తన ఖాతాను కూడా తెరవలేకపోయాడు. దింతో ఇద్దరు డక్ అవుట్ గా ఏను తిరిగారు.

Also Read: Zebra : సత్యదేవ్ జీబ్రా ఓవర్సీస్ టాక్.. హిట్టా లేదా ఫట్టా..?

ఆ తర్వాత జోష్ హేజిల్‌వుడ్ వ్యక్తిగత స్కోరు 5 వద్ద విరాట్ కోహ్లీని అవుట్ చేయడం ద్వారా భారత్‌కు మూడో దెబ్బ పడింది. లంచ్ ప్రకటనకు ముందు కేఎల్ రాహుల్ 26 పరుగుల వద్ద స్టార్క్ బౌలింగ్‌లో వివాదాస్పదంగా ఔటయ్యాడు. లంచ్ విరామం తర్వాత మిచెల్ మార్ష్ ధృవ్ జురెల్ (11), వాషింగ్టన్ సుందర్ (4)లను తన ఖాతాలో వేసుకున్నాడు. 37 పరుగులు చేసి మంచి టచ్ లో ఉన్న పంత్ పాట్ కమిన్స్ విలువైన వికెట్ తీశాడు. దీని తర్వాత, హర్షిత్ రాణా 7 పరుగుల వద్ద అవుట్ కాగా.. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 8 పరుగుల వద్ద ఔటయ్యాడు. భారత్‌కు చివరి వికెట్ నితీష్ రాణా రూపంలో పడింది. జోష్ హేజిల్‌వుడ్‌ 4 వికెట్స్ తీయగా.. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్ లు చెరో 2 వికెట్లు తీశారు.

Also Read: IPL 2025 Auction: ఆర్ అశ్విన్‌కు రూ.8.5 కోట్లు.. ఏ జట్టు తీసుకుందంటే?