Imran Tahir: “ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్..” 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. ఇమ్రాన్ తాహిర్ రికార్డు.!
- 47 ఏళ్ల వయసులో ఇమ్రాన్ తాహిర్ అద్భుత ప్రదర్శన
- సీపీఎల్ 2026లో ఐదు వికెట్ల ఘనత
- సెయింట్ లూసియా కింగ్స్‌పై 4 ఓవర్లలో 17 పరుగులకు 5 వికెట్లు
- టీ20 కెరీర్లో తాహిర్‌కు ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Tahir: ‘వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే’ అనే మాటను దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (Imran Tahir) మరోసారి నిజం చేశారు. 47 ఏళ్ల వయసులోనూ టీ20 క్రికెట్లో తన సత్తా చాటుతూ అదరగొడుతున్నాడు. యువ ఆటగాళ్లతో పోటీ పడుతూ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2026లో తన టీ20 కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేశారు.
CPL 2026లో భాగంగా జరిగిన 31వ మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్‌తో తలపడిన గయానా అమెజాన్ వారియర్స్‌కు ఇమ్రాన్ తాహిర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా ముందుండి జట్టును నడిపించడమే కాకుండా, బంతితోనూ ప్రత్యర్థి బ్యాటర్లను వణికించాడు. సెయింట్ లూసియా కింగ్స్‌పై ఇమ్రాన్ తాహిర్ కేవలం 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు. ఇది టీ20ల్లో ఆయనకు అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. ఇంతకుముందు టీ20ల్లో తాహిర్ అత్యుత్తమ ప్రదర్శన 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయడం. తాజాగా ఆ రికార్డును అధిగమించారు.
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ఇమ్రాన్ తాహిర్ తన CPL కెరీర్లో రెండోసారి ఐదు వికెట్ల ఘనత సాధించగా.. మొత్తం టీ20 కెరీర్లో ఇది ఆరోసారి. అంతేకాకుండా CPLలో కెప్టెన్‌గా ఐదు వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించారు. అంతేకాదు, 47 ఏళ్ల వయసులో ఐదు వికెట్లు తీసిన ఇమ్రాన్ తాహిర్ ఫ్రాంచైజీ క్రికెట్లో ఈ ఘనత సాధించిన అత్యంత పెద్ద వయసున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆటకు దూరం కావాల్సిన సమయంలోనూ తాహిర్ తన స్పిన్‌తో యువ ఆటగాళ్లకు గట్టి పోటీ ఇస్తున్నారు.
తాహిర్ అద్భుత బౌలింగ్‌కు సెయింట్ లూసియా కింగ్స్ బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలింది. గయానా బౌలర్ల ధాటికి ఆ జట్టు 20 ఓవర్లు కూడా పూర్తి చేయలేకపోయింది. 18.5 ఓవర్లలోనే 119 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత గయానా అమెజాన్ వారియర్స్ 18.3 ఓవర్లలో 122/6 పరుగులు చేసి విజయం సాధించింది. 5 వికెట్ల ప్రదర్శనతో ఇమ్రాన్ తాహిర్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ++
Imran Tahir picked 5/17 in the CPL at the age of 47. 🤯 pic.twitter.com/yIG2qsZXcG
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 10, 2026
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!