NTV Telugu Site icon

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్..

Imran

Imran

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం కోసం చేసిన కృషికి గాను ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ఈ సమాచారాన్ని పాకిస్తాన్ వరల్డ్ అలయన్స్, నార్వేజియన్ రాజకీయ పార్టీ సెంటర్ తెలిపాయి. ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ కావడం ఇది రెండోసారి. 2019 ప్రారంభంలో, దక్షిణాసియాలో శాంతిని పెంపొందించడానికి ఆయన చేసిన కృషికి ఆయన నామినేట్ అయ్యారు.

Also Read:Egg Price Hikes In US: మండుతున్న గుడ్ల ధరలు.. డజను గుడ్ల ధర రూ. 870

పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 2023 నుంచి జైలులో ఉన్నారు. అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై ఆయనకు 14 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఏప్రిల్ 2022లో అవిశ్వాస తీర్మానం తర్వాత ఆయన అధికారం నుంచి తొలగించబడ్డాడు. ప్రతి సంవత్సరం నోబెల్ కమిటీ వందలాది నామినేషన్లను స్వీకరిస్తుంది. ఆ తర్వాత వారు ఎనిమిది నెలల సుదీర్ఘ ప్రక్రియ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు.