NTV Telugu Site icon

Pakistan: ఇమ్రాన్‌కు గుండెపోటు వచ్చేలా ఇంజెక్షన్ ఇచ్చారు.. లాయర్ల ఆరోపణలు

Imran Khan

Imran Khan

Given injection to kill me slowly Says Former Pakistan PM Imran Khan: అవినీతి కేసులో అరెస్టయిన పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలులోనే హతమార్చేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అతడిని చిత్రహింసలకు గురిచేశారని, గుండెపోటు వచ్చేలా ఆహారం, ఇంజెక్షన్‌ ఇచ్చారని ఇమ్రాన్‌ తరఫున వాదించే లాయర్లు పేర్కొన్నారు. ప్రతిపక్ష పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న రాజకీయవేత్తగా మారిన క్రికెటర్ తనకు నెమ్మదిగా గుండెపోటు వచ్చేలా ఇంజెక్షన్ ఇచ్చారని, వాష్‌రూమ్‌ను ఉపయోగించేందుకు అనుమతించలేదని ఆరోపించారు. ఆయన ఛాతీ నొప్పితో కూడా ఫిర్యాదు చేశారు. లాయర్లు ఇమ్రాన్‌ను కలిసిన తర్వాత చెప్పారు. ఆయనను జైల్లోనే హత్య చేసేందుకు కుట్రలు జరిగాయని ఆరోపించారు. ‘తనను జైల్లో నిద్ర పోనివ్వట్లేదని ఇమ్రాన్‌ చెప్పారు. టాయిలెట్‌, బెడ్‌లేని ఒక గదిలో ఆయన్ను ఉంచారు. వాష్‌రూమ్‌ వాడుకోవడానికి అనుమతించడం లేదు. చిత్రహింసలు పెట్టారు. నెమ్మదిగా గుండెపోటును ప్రేరేపించే ఆహారం, ఇంజెక్షన్లు ఇచ్చారు. ఛాతిలో అసౌకర్యంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇక ఇస్లామాబాద్‌లోని పోలీస్‌ లైన్స్‌కు తీసుకువచ్చిన తర్వాత ఆహారం కూడా ఇవ్వడం లేదు’ అని ఇమ్రాన్‌ న్యాయవాదులు వెల్లడించారు.

Read Also: Summer heat: ఎండదెబ్బకు జనం విలవిల.. వేసవి తాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

ఇమ్రాన్‌ ఖాన్ అరెస్టును పాకిస్తాన్ సుప్రీంకోర్టు “చట్టవిరుద్ధం”గా అభివర్ణించింది. అతనిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈరోజు ఆయన ఇస్లామాబాద్ హైకోర్టుకు ముందస్తు బెయిల్ కోసం హాజరుకానున్నారు. కోర్టు వెలుపల తన మద్దతుదారులను కూడా మాట్లాడనున్నారు. ప్రస్తుతం ఇమ్రాన్‌ఖాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) కస్టడీలో ఉన్నారు. అవినీతి కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను మంగళవారం పారామిలిటరీ రేంజర్లు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఓ అవినీతి కేసుకు సంబంధించి ఇస్లామాబాద్‌ హైకోర్టులో విచారణకు హాజరైన సమయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్టుతో దేశవ్యాప్తంగా విధ్వంసకర ఘటనలు చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్‌లో ప్రజాదరణ పొందిన మాజీ క్రికెట్ స్టార్ ఇమ్రాన్‌ఖాన్‌, చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించడానికి పోరాడుతూ ఉండాలని ప్రజలను కోరారు.