Site icon NTV Telugu

Imran khan: జైలులో నాకు నాసిరకం ఆహారం అందిస్తున్నారు.. విడుదల చేయండి

Imran Khan

Imran Khan

జైలులో తనకు నాసిరకం ఆహారం ఇస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. పాకిస్తాన్ లోని పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ ఆదేశాల మేరకే తనకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీని కారణంగా తన ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తోందని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. తక్షణమే హెల్త్ చెకప్ చేయాలనే డిమాండ్ కూడా ఆయన లేవనెత్తారు. పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ సోమవారం ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా బ్లాక్ డేగా పాటించింది. 190 మిలియన్ పౌండ్ల అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అరెస్టు చేసింది. ఈ సందర్భంగా పీటీఐ సీనియర్ నాయకుడు మూనిస్ ఎలాహి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో స్పందించారు. ‘పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఆదేశాల మేరకు ఇమ్రాన్ ఖాన్‌కు జైలులో నాసిరకం ఆహారం అందిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది.’ అని తెలిపారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ మాత్రమే ఇంత నీచ స్థాయికి దిగజారుతుందని ఆయన దుయ్యబట్టారు. పాకిస్థాన్ ప్రజల హక్కుల కోసం ఏడాది పాటు జైలులో ఉండి ఇమ్రాన్ ఖాన్ ధైర్యాన్ని ప్రదర్శించారని మూనిస్ ఇలాహి చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ధైర్యసాహసాలకు సెల్యూట్ చేస్తున్నాం.. అతనిపై పెట్టిన తప్పుడు కేసుల్లో అతన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.

Read Also: Andhra Pradesh: వాలంటీర్ల కొనసాగింపుపై మంత్రి కీలక ప్రకటన

మరో పీటీఐ నాయకుడు జుల్ఫీ బుఖారీ మాట్లాడుతూ, ‘జైలులో రిఫ్రిజిరేటర్ లేదని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఈ కారణంగా ఆహారం పాడవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డాడు. ఆయన ఆరోగ్యాన్ని పరిశీలించి కూడా అరకొర చర్యలు తీసుకుంటున్నారు.’ ఇది పీటీఐ వ్యవస్థాపకుడి ప్రాణాలకు పెద్ద ముప్పుగా మారుతుందని చెప్పారు. గత ఏడాది మే 9న జరిగిన అల్లర్ల కేసులో ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. అతని అరెస్టు తర్వాత పాకిస్తాన్‌లో అల్లర్లు చెలరేగాయి. అవినీతికి సంబంధించిన కేసులో హైకోర్టుకు హాజరైన సమయంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టయ్యారు. అతని అరెస్టు తర్వాత.. పాకిస్తాన్‌లోని వివిధ ప్రదేశాలలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ ధర్నాలో ప్రభుత్వ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది.

Read Also: Bangladesh – Indian Trains: బంగ్లాదేశ్కు భారత ట్రైన్స్ బంద్.. ఎల్ఐసీ ఆఫీసు క్లోజ్..!

Exit mobile version