Imran khan: జైలులో నాకు నాసిరకం ఆహారం అందిస్తున్నారు.. విడుదల చేయండి
- జైలులో తనకు నాసిరకం ఆహారం ఇస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపణ
- పాకిస్తాన్ లోని పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ ఆదేశాల మేరకే..
- నాకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారు- ఇమ్రాన్ ఖాన్
- దీంతో నా ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తోంది- ఇమ్రాన్ ఖాన్
- తక్షణమే హెల్త్ చెకప్ చేయాలని డిమాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జైలులో తనకు నాసిరకం ఆహారం ఇస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. పాకిస్తాన్ లోని పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ ఆదేశాల మేరకే తనకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీని కారణంగా తన ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తోందని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. తక్షణమే హెల్త్ చెకప్ చేయాలనే డిమాండ్ కూడా ఆయన లేవనెత్తారు. పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ సోమవారం ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా బ్లాక్ డేగా పాటించింది. 190 మిలియన్ పౌండ్ల అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అరెస్టు చేసింది. ఈ సందర్భంగా పీటీఐ సీనియర్ నాయకుడు మూనిస్ ఎలాహి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో స్పందించారు. ‘పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఆదేశాల మేరకు ఇమ్రాన్ ఖాన్‌కు జైలులో నాసిరకం ఆహారం అందిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది.’ అని తెలిపారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ మాత్రమే ఇంత నీచ స్థాయికి దిగజారుతుందని ఆయన దుయ్యబట్టారు. పాకిస్థాన్ ప్రజల హక్కుల కోసం ఏడాది పాటు జైలులో ఉండి ఇమ్రాన్ ఖాన్ ధైర్యాన్ని ప్రదర్శించారని మూనిస్ ఇలాహి చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ధైర్యసాహసాలకు సెల్యూట్ చేస్తున్నాం.. అతనిపై పెట్టిన తప్పుడు కేసుల్లో అతన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
Read Also: Andhra Pradesh: వాలంటీర్ల కొనసాగింపుపై మంత్రి కీలక ప్రకటన
Also Read
- AAP: ఆప్‌కు బిగ్ షాక్.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్..
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Sonia Gandhi: ‘బిలాంగింగ్’ పేరుతో సోనియాగాంధీ ఆత్మకథ.. రాజీవ్‌గాంధీతో ప్రేమ ముచ్చట్లు
- Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్ జోరు.. దక్షిణాఫ్రికాపై 6-1 ఘన విజయం
మరో పీటీఐ నాయకుడు జుల్ఫీ బుఖారీ మాట్లాడుతూ, ‘జైలులో రిఫ్రిజిరేటర్ లేదని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఈ కారణంగా ఆహారం పాడవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డాడు. ఆయన ఆరోగ్యాన్ని పరిశీలించి కూడా అరకొర చర్యలు తీసుకుంటున్నారు.’ ఇది పీటీఐ వ్యవస్థాపకుడి ప్రాణాలకు పెద్ద ముప్పుగా మారుతుందని చెప్పారు. గత ఏడాది మే 9న జరిగిన అల్లర్ల కేసులో ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. అతని అరెస్టు తర్వాత పాకిస్తాన్లో అల్లర్లు చెలరేగాయి. అవినీతికి సంబంధించిన కేసులో హైకోర్టుకు హాజరైన సమయంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టయ్యారు. అతని అరెస్టు తర్వాత.. పాకిస్తాన్‌లోని వివిధ ప్రదేశాలలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ ధర్నాలో ప్రభుత్వ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది.
Read Also: Bangladesh – Indian Trains: బంగ్లాదేశ్‌కు భారత ట్రైన్స్ బంద్.. ఎల్ఐసీ ఆఫీసు క్లోజ్..!
తాజావార్తలు
-
AAP: ఆప్‌కు బిగ్ షాక్.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్..
-
Colgate: కొల్గేట్ ప్రియులకు షాక్.. టూత్‌పేస్ట్ ధరలు పెరగనున్నాయా?
-
VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
-
Sonia Gandhi: ‘బిలాంగింగ్’ పేరుతో సోనియాగాంధీ ఆత్మకథ.. రాజీవ్‌గాంధీతో ప్రేమ ముచ్చట్లు
-
Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్ జోరు.. దక్షిణాఫ్రికాపై 6-1 ఘన విజయం
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!