Site icon NTV Telugu

IMF: పాకిస్తాన్‌కి 1 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ రుణం.. భారత్ హెచ్చరికలు బేఖాతరు..

Imf

Imf

IMF: భారత అభ్యంతరాలను పట్టించుకోకుండా, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పాకిస్తాన్‌కి 1 బిలియన్ డాలర్లు రుణాన్ని మంజూరు చేసింది. ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ(EFF) కింద బెయిలౌట్ ప్యాకేజీని అందించినట్లు పాకిస్తాన్ ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) తెలిపింది. ఐఎంఎఫ్ రుణాలను పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తుందని, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందనే భారత ఆందోళనల్ని ఐఎంఎఫ్ పట్టించుకోలేదు. ఐఎంఎఫ్ పాకిస్తాన్‌కి రుణం ఇచ్చేందుకు నిర్వహించిన ఓటింగ్‌కి భారత్ దూరంగా ఉండి తన నిరసన తెలియజేసింది.

Read Also: Operation Sindoor Live Updates: భారత్‌-పాక్‌ యుద్ధ సమాచారం మినిట్‌ టు మినిట్ అప్డేట్స్ …

గతంలో ఐఎంఎఫ్ ఇచ్చిన రుణాలను పాక్ సమర్థవంతంగా ఉపయోగించలేదని, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రసంస్థలకు వినియోగించిందని భారత్ తన ఆందోళనల్ని వ్యక్తం చేసింది. మే 9న వాషింగ్టన్‌లో జరిగిన IMF బోర్డు సమావేశంలో, IMF సహాయానికి సంబంధించిన షరతులను పాకిస్తాన్ పదేపదే పాటించడంలో విఫలమైందని భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌కి ఆర్థిక సహాయం పరోక్షంగా సైనిక నిఘా కార్యకలాపాలకు వాడినట్లు భారత్ చెప్పింది. సీమాంతర ఉగ్రవాదం అంతం చేయడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోని పాకిస్తాన్‌కి ఆర్థిక సాయం అందించడంలో జాగ్రత్త వహించాలని భారత్ కోరింది. అయినప్పటికీ, భారత అభ్యంతరాలను భేఖాతరు చేసి ఐఎంఎఫ్ పాకిస్తాన్‌కి రుణం అందించింది.

Exit mobile version