Site icon NTV Telugu

Samantha: ఆ విషయంలో సమంత.. అల్లు అర్జున్ ను వెనక్కి నెట్టేసిందా ?

Samantha

Samantha

Samantha: ఎన్ని వివాదాలు వచ్చిన సమంత పాపులారిటీ పెరుగుతోనే ఉంది. ప్రస్తుతం తాను అగ్రతారగా వెలుగుగొందుతుందన్న విషయం స్పష్టమైంది. స్టార్ హీరోలకు మించి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. సినిమా హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా అభిమానులను పెంచుకుంటోంది. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర తారలను వెనక్కునెట్టి పాపులర్‌ ఇండియన్‌ సెలబ్రెటీ జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. ఐఎమ్‌డీబీ విడుదల చేసిన ఈ జాబితాలో సమంత ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంది.

Read Also:Dimple Hayathi: పాపకు బంగారంతో గుడి కట్టాలంట ఫ్రెండ్స్

ఐఎండీబీ (ఇండియన్‌ మూవీ డేటాబేస్‌) 2022లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారలను ప్రకటించగా సమంత మొదటి స్థానంలో నిలిచింది. అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లను సైతం వెనక్కి నెట్టి సమంత అగ్ర స్థానంలో నిలవడం చెప్పుకోదగిన విషయం. ఇదే జాబితా గతంలో రిలీజ్ చేయగా తొమ్మిదో స్థానంలో నిలిచిన సమంత.. ఇప్పుడు తొలి స్థానానికి చేరుకున్నారు. ఈ లిస్టులో దక్షిణాదికి చెందిన మరో ముద్దుగుమ్మ బుట్టబొమ్మ పూజా హెగ్డే 17వ స్థానంలో ఉంది. ఈ లిస్టులో సమంతకు అగ్ర స్థానం రావడం ఆమె క్రేజ్ కి నిదర్శనంగా మారింది.

Read Also:Jabardasth Mahesh: ప్రభాస్ కామెడీ.. చెప్తే చెప్పావ్ కానీ బాసూ.. కడుపు నిండిపోయింది

అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మావ’ సాంగ్ చేసి క్లాస్, మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ను ఊపేసింది. మొన్నటివరకు మాయోసైటిస్ వ్యాధితో బాధపడింది. కాస్త కోలుకుని తిరిగి సినిమాలతో బిజీ అయింది. రీసెంట్‎గా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం రాజ్- డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తోంద. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ మూవీతో బాలీవుడ్ లో పాగా వేయాలని చాలా కష్టపడుతుందట సామ్. ఈ సిటాడెల్ సినిమాతో పాటు విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా కూడా చేస్తోంది.

Exit mobile version