ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా సాధారణ రుతుపవనాలు ముందే వస్తున్నాయి.. దీని వల్ల ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉండవచ్చని ఐఎండీ అధికారులు చెప్పుకొచ్చారు. జూన్, సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే, జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని గంగా ప్రాంతం, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD చీఫ్ చెప్పారు.
Read Also: Pushpa 2 Second Single : 6 భాషల్లో పాట పాడిన ఆ స్టార్ సింగర్..?
కాగా, జూన్- సెప్టెంబర్ మధ్య సగటు (ఎల్‌పీఎ)లో 106 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి చీఫ్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ సహా వాయువ్య భారతదేశంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక, వర్షాధార వ్యవసాయ రంగంలో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇందులో రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి.
Read Also: Nandamuri Balakrishna: ఎన్టీఆర్ అంటే ఓ శక్తి.. తెలుగువారికి ఆరాధ్య దైవం!
జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ మధ్య దేశం మొత్తం 87 సెంటీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు అవుతుందని ఐఎండీ చీఫ్ మహాపాత్ర చెప్పారు. మధ్య భారతం, దక్షిణ ద్వీపకల్పంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నైరుతి రుతుపవనాలు దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలకు విస్తరించాయని పేర్కొన్నారు. రాబోయే ఐదు రోజులలో రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాలలోకి ప్రవేశించడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పాడుతాయి.
