AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తనిఖీల్లో భాగంగా రూ.119 కోట్ల విలువైన అక్రమ మద్యం, డ్రగ్స్‌ను స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(SEB) అధికారులు పట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 150కి పైగా చెక్ పోస్టుల్లో తనిఖీలు చేస్తున్నట్టు సెబ్ వెల్లడించింది.
Read Also: Botsa Satyanarayana: ఐదేళ్ల పాలన చూసి మళ్లీ గెలిపించమని అడుగుతున్నాం..
కర్ణాటక, తెలంగాణా, గోవాల నుంచి రవాణా అవుతున్న అక్రమ మద్యాన్ని నిలువరిస్తున్నట్టు స్పష్టం చేసింది. అక్రమ మద్యాన్ని నిలువరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 39,232 మందిపై బైండోవర్ కేసులు పెట్టామని తెలిపింది. ఈ వ్యవహారంలో 68,312 కేసులు నమోదు అయినట్టు పేర్కొంది. పోలీసు, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ, రవాణా, రెవెన్యూ తదితర విభాగాలతో కలిసి 31 ఇంటిగ్రెటెడ్ చెక్ పోస్టుల నిర్వహణతో పాటు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది.