Site icon NTV Telugu

Elections 2024: టూవీలర్‌ లో రూ.53.5 లక్షలు.. సీజ్ చేసిన అధికారులు

53 Laksh

53 Laksh

Elections 2024: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కూకట్‌పల్లిలో భారీగా నగదు పట్టుబడింది. వాహనాల తనిఖీల్లో భాగంగా రాజేంద్ర నగర్‌ ఎస్‌ఓటీ పోలీసులకు రూ.53.5 లక్షలు పట్టుబడ్డాయి. ఎన్నికల్లో భాగంగా టూవీలర్ ను ఆపిన పోలీసులకు షాక్‌ తగిలింది. టూవీలర్‌ లో రూ.53.5 లక్షలు డబ్బులు తరలిస్తుండటంతో రాజేంద్ర నగర్‌ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ డబ్బుకు వివరాలు అడగగా.. పొంతలేని సమాధానం చెప్పడంతో డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ చెకింగ్ తప్పించుకోవడానికి ముందు ఓ బైక్ తో పైలెటింగ్ చేసి తెలివిగా డబ్బులు తరలించే ప్రయత్నం చేసిన ఇద్దరిని ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకుని ఇద్దరి అరెస్ట్‌ చేశారు.

Read also: SVC59 : కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే.. దేవరకొండ సినిమా అప్డేట్ వచ్చేసింది..

డబ్బును సీజ్‌ చేసి, రెండు బైక్ లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఈ క్యాష్ ఎక్కడి నుంచి తెస్తున్నారు.. ఎవరి కోసం తీసుకెళ్తున్నారు.. ఎవరు ఇచ్చారు? లాంటి విషయాలపై కూపీలాగుతున్నారు. నిన్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా జయశంకర్ విగ్రహం వద్ద నగదు పట్టుబడింది. జిల్లా కేంద్రం చెందిన ఓ వ్యాపారి వద్ద రూ.1లక్ష పది వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకొని పోలీసులు ఎన్నికల అధికారికి అప్పగించారు.
Aavesham: 150 కోట్ల ఫహాద్ ఫాజిల్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడ చూడాలంటే?

Exit mobile version