సరోగసీ ముసుగులో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సాగించిన మోసాలు అన్ని ఇన్ని కావు. గత కొన్ని రోజులుగా సృష్టి పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. సృష్టి తరహాలో మేడ్చల్‌లో మరో అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) సెంటర్లపై పోలీసుల దాడి చేసి అసలు గుట్టు రట్టు చేశారు. క్లినిక్‌ల ముసుగులో అక్రమంగా సరోగసి చేస్తున్న 6 క్లినిక్‌లు పోలీసులు గుర్తించారు. ఇంట్లోనే సరోగసి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తున్న భార్య భర్తలను అదుపులోకి తీసుకున్నారు.
ఓ ముఠా కమర్షియల్ సరోగసి, ఇల్లీగల్ ఎగ్ ట్రేడింగ్‌కి పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లోని కొన్ని ఫర్టిలిటీ సెంటర్ల సహకారంతో 7 మహిళలు, ఓ వ్యక్తి కలిసి పెద్ద ఎత్తున రాకెట్ సాగితున్నారు. పిల్లలు లేని జంటలను టార్గెట్ చేసుకుని అక్రమ దందా నడుపుతున్నారు. ప్రధాన నిందితురాలు లక్ష్మిరెడ్డి అలియాస్ లక్ష్మి గతంలో ఎగ్ డోనర్ అండ్ సరోగేట్ మదర్‌గా పని చేసింది. తన పరిచయాలు, అనుభవం ఉపయోగించి.. ఇతర ఏజెంట్లు, ఫర్టిలిటీ సెంటర్లతో కలసి మహిళలను డోనర్లు, సరోగేట్లుగా రిక్రూట్ చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలను టార్గెట్ చేసి.. తన ఇంట్లో ఉంచి హాస్పిటళ్ల నుండి మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా తీసుకుంది. ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి ఈ వ్యాపారంలో తల్లికి సహకరించాడు. కమర్షియల్ సరోగసీ చట్టవిరుద్ధమని తెలిసినా.. డోనర్లు, సరోగేట్ తల్లులు ఈ దందాలో ఉన్నారు.
నిందితుల దగ్గర నుంచి రూ.6.47 లక్షల నగదు, లెనోవో ల్యాప్‌టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిరంజీలు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, హెగ్డే హాస్పిటల్ కేస్ షీట్లు, 5 స్మార్ట్‌ఫోన్లు, 1 కీప్యాడ్, 1 మొబైల్ సైతం స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మి రెడ్డి 2024లో మహారాష్ట్రలో మానవ అక్రమ రవాణా కేసులో కూడా నిందితురాలుగా ఉంది. సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్, BNS యాక్ట్ కింద కేసు నమోదు అయింది. మిగతా గ్యాంగ్ సభ్యుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: Anirudh Ravichander-Coolie: అనిరుధ్.. సౌండ్ లేదేంటి?
అరెస్ట్ అయిన వారి లిస్ట్:
1. నర్రెద్దుల లక్ష్మి రెడ్డి– చింతల్, కుత్బుల్లాపూర్, అసలు ఊరు చిలకలూరిపేట, ఏపీ.
2. నర్రెద్దుల నరేందర్ రెడ్డి – చింతల్, కుత్బుల్లాపూర్, అసలు ఊరు చిలకలూరిపేట, ఏపీ.
డోనర్లు / సరోగేట్ తల్లులు:
3. గోల్కొండ సాయి లీలా – బీదర్, కర్ణాటక.
4. మలగల్ల వెంకట లక్ష్మి – రంపచోడవరం, ఏపీ.
5. పి. సునీత – అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏపీ.
6. సదల సత్యవతి – రంపచోడవరం, ఏపీ.
7. పంటాడా అపర్ణ – విజయనగరం జిల్లా.
8. జె. రమణమ్మ – విజయనగరం జిల్లా.
