Woman SI Attacked: ఏపీలో కర్ణాటక అక్రమ మద్యం అమ్మకాలు.. అడ్డుకున్న మహిళా ఎస్సైపై దాడి..
- అగళిలో మహిళ ఎస్పై పై దాడి చేసిన కర్ణాటక అక్రమ మద్యం అమ్మకం దారులు..
- అగళి మండలం ఇరిగేపల్లి గ్రామంలో కర్ణాటక మద్యం అమ్మకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman SI Attacked: శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలంలో అక్రమ మద్యం అమ్మకాలపై చర్యలు తీసుకునేందుకు వెళ్లిన మహిళా ఎస్సైపై దాడి జరిగింది. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలించి విక్రయిస్తున్న వారిని పట్టుకునే క్రమంలో ఎస్సై శోభారాణిపై దాడికి పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అగళి మండలం ఇరిగేపల్లి గ్రామంలో కర్ణాటక మద్యం అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్సై శోభారాణి తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. హోటళ్లు, డాబాలు తదితర ప్రాంతాలకు కర్ణాటక మద్యం సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా మల్లికార్జున మరియు అతని కూతురు కీర్తనను పట్టుకున్నారు.
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
అయితే, తమపై కేసు నమోదు చేయకుండా తప్పించుకునే ప్రయత్నంలో తండ్రి–కూతురు పోలీసులపై రెచ్చిపోయారు. ఈ క్రమంలో కీర్తన ఎస్సై శోభారాణిని చెంపపై కొట్టినట్లు పోలీసులు తెలిపారు. విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారిపై చేయి చేసుకోవడం తీవ్ర నేరమని హెచ్చరించినా వారు వినకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే దాడికి పాల్పడ్డ మల్లికార్జున, కీర్తనను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విధులకు ఆటంకం కలిగించడం, పోలీసు అధికారిపై దాడి చేయడం వంటి అభియోగాల కింద కీర్తనపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ మద్యం అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులపై దాడులు చేస్తే చట్టప్రకారం కఠిన శిక్ష తప్పదని జిల్లా పోలీసు అధికారులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్‌కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!