Bhuvanagiri: భువనగిరిలోని గాయత్రి ఆసుపత్రిపై ఎస్ఓటీ పోలీసులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో ఆసుపత్రిలో ఇద్దరు మహిళలకు అక్రమంగా అబార్షన్ చేస్తున్న ఘటనను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా డాక్టర్ శివకుమార్ ను పోలీసులు గుర్తించి.. అతనిని భువనగిరి టౌన్ పోలీసులకు హ్యాండోవర్ చేశారు. డాక్టర్ శివకుమార్ అరెస్ట్ అవ్వడం ఇది మొదటి సారి కాదు.
Read Also:AP Employee unions: ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల హెచ్చరికలు..!
2022లో ఆలేరులో ఓ బాలికకు అక్రమ అబార్షన్ నిర్వహించిన సమయంలో కూడా ఇతను రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అప్పట్లో అతను నిర్వహిస్తున్న ‘స్వాతి హాస్పిటల్’ను వైద్యాధికారులు సీజ్ చేశారు. అనంతరం డాక్టర్ శివకుమార్ తన అసలు పేరు, హాస్పిటల్ పేరు మార్చి, గాయత్రి ఆసుపత్రిగా మళ్లీ ప్రారంభించాడు. ప్రస్తుతం ఆయన ప్రతి అబార్షన్‌కు రూ.50,000 వసూలు చేస్తూ వైద్యం అందిస్తున్నట్టు సమాచారం.
Read Also:Texas Floods: సెకన్ల వ్యవధిలో ముంచెత్తేసిన టెక్సాస్ వరదలు.. వీడియోలు వైరల్
ఈ విషయమై పక్క సమాచారంతో స్పందించిన భువనగిరి ఎస్ఓటీ పోలీసులు ఆసుపత్రిలో జరగుతున్న అబార్షన్లను, రెగ్యులర్ రికార్డులను పరిగణనలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. గాయత్రి ఆసుపత్రి స్థాపించిన తర్వాత ఇప్పటివరకు ఎన్ని అబార్షన్లు జరిగాయి, అవన్నీ చట్టబద్ధమైనవేనా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. అబార్షన్లకు అడ్డాగా ఆసుపత్రిని మలచడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార యంత్రాంగం వెంటనే దర్యాప్తు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
