NTV Telugu Site icon

Ileana : బాత్రూంలో బికినీలో ఇలియానా సెల్ఫీ..వైరల్ అవుతున్న హాట్ ఫోటో..

Whatsapp Image 2024 02 19 At 2.15.26 Pm

Whatsapp Image 2024 02 19 At 2.15.26 Pm

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గతంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అలరించిన ఈ భామ వెండితెరపై కనిపించి చాలా కాలమే అయింది.. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం తన ఫ్యాన్స్ ని ఎంతగానో అలరిస్తుంది. అయితే ఇలియానా ఎన్నోసార్లు బికినీలో కనిపించడం చూసే ఉంటారు. కానీ తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోకు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమె పోస్ట్ చేసిన ఈ ఫొటో సరిగ్గా ఏడాది కిందట తీసినది. అంటే అప్పట్లో ఆమె ప్రెగ్నెంట్. తాను నాలుగు నెలల ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి ఫొటో ఇది అంటూ ఇలియానా ఈ బికినీ సెల్ఫీ ని షేర్ చేసింది.ఈ ఫొటోలో ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో ఈ ఫొటో దిగగా.. ఏడాది అయిందంటూ ఆమె ఈ ఫొటో పోస్ట్ చేసింది.

తన ప్రెగ్నెన్సీ రోజులను బాగానే ఆస్వాదించిన ఆమె.. ఇప్పుడా రోజులను మిస్ అవుతున్నాను అన్నట్లుగా ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటుంది.. ప్రస్తుతం ఇలియానా అమెరికాలో తన పార్ట్‌నర్ తో కలిసి ఉంటోంది.ఈ మిర్రర్ సెల్ఫీ బ్లాక్ అండ్ వైట్ లో ఉండటం విశేషం. బ్లాక్ బికినీలో ఓ చేత్తో తన బేబీ బంప్ ను చూపిస్తూ సెల్ఫీ దిగింది. “ఏడాది కిందట. నాలుగు నెలల ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో ఇలా” అనే క్యాప్షన్ తో ఇలియానా ఈ ఫొటో ను షేర్ చేసింది. ఆమె ఈ మధ్యే తన పార్ట్‌నర్ మైఖేల్ డోలాన్ తో కలిసి వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంది.ఈ సెలబ్రేషన్స్ లో ఇద్దరూ బ్లాక్ డ్రెస్సుల్లో కనిపించారు. ఇలియానా బ్లాక్ గౌన్ లో స్టన్నింగా కనిపించింది. నా తొలి రియల్ వాలెంటైన్ కు హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ ఆ ఫొటోను షేర్ చేసింది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే ఇలియానా.. దో ఔర్ దో ప్యార్ అనే మూవీలో నటిస్తోంది. ఇందులో విద్యా బాలన్ మరియు ప్రతీక్ గాంధీ వంటి వారు కూడా నటిస్తున్నారు.ఈ సినిమా మార్చి 29న రిలీజ్ కానుంది