NTV Telugu Site icon

Tera Kya Hoga Lovely : డీ గ్లామర్ లుక్ లో ఇలియానా.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..

Whatsapp Image 2024 02 28 At 10.40.30 Am

Whatsapp Image 2024 02 28 At 10.40.30 Am

బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా, ఇలియానా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తేరా క్యా హోగా లవ్లీ’. సోషల్ కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న థియేటర్లలో విడుదల కానుంది.ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. బల్వీందర్ సింగ్ జంజువా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నవ్విస్తూనే, పలు సామాజిక అంశాలను టచ్ చేస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది.‘తేరా క్యా హోగా లవ్లీ‘ సినిమా అందం, వరకట్నం లాంటి విషయాలను ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అందంగా లేని అమ్మాయిలు సమాజంలో ఎలా చిన్న చూపుకు గురవుతున్నారు..అనే విషయాన్ని దర్శకుడు బల్వీందర్ ఈ మూవీలో చూపించే ప్రయత్నం చేసారు.. ఈ సినిమాలో ఇలియానా అందంగా లేని అమ్మాయిగా కనిపించింది. ఆమె రంగు కారణంగా ఎన్నో పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అవుతాయి.

రెట్టింపు కట్నం ఇస్తే అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని ఓ కుటుంబం ముందుకు వస్తుంది. అదే సమయంలో ఇలియానా ఇంట్లో దొంగతనం జరుగుతుంది. కట్నంగా ఇవ్వాల్సిన ఖరీదైన వస్తువులన్నీ దొంగలు దోచుకుంటారు.. అమ్మాయి తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఈ కేసును హర్యానా పోలీసు అధికారి రణదీప్ దర్యాప్తు చేస్తాడు. దొంగలను పట్టుకునేందుకు ఆయన ప్రయత్నిస్తాడు.విచారణలో భాగంగా ఇలియానాతో పాటు ఆమె కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తాడు. ఈ సమయంలో ఆమెను ఇష్టపడుతాడు. అప్పుడు ఈ సోషల్ కామెడీ మూవీలో రొమాంటిక్ ట్విస్ట్ మొదలవుతుంది.. ఈ మూవీ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది.అయితే మేకర్స్ ట్రైలర్లో ఓ డిస్క్లెయిమర్ ను యాడ్ చేశారు. “భారత రాజ్యాంగం మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. ఇది కేవలం కల్పిత చిత్రం. చర్మం రంగు, వరకట్నం అనేది ఒక సామాజిక దురాచారం. ఈ సినిమాతో సంబంధం ఉన్న ఏ వ్యక్తి కూడా వరకట్న ఆచారాన్ని ఆమోదించరు” అని ప్రకటించారు.