గోవా బ్యూటీ ఇలియానా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించింది.. అందులో కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వగా, మరి కొన్ని సినిమాలు ప్లాప్ టాక్ ను అందుకున్నాయి.. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉందని తెలుస్తుంది.. ఇప్పుడు సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి..
దేవదాస్ నుంచి మొదలైన ఈమె సినిమాల జోరు .. పోకిరి నుంచి పీక్స్‌కు వెళ్లిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపొయింది.. తెలుగులో తొలి కోటి రూపాయల పారితోషికం అందుకున్న బ్యూటీ కూడా ఇలియానే. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు ఇలియానా… ఆ తర్వాత ప్రేమలో పడి కేరీర్ ను చేతులారా నాశనం చేసుకుంది.. అయితే ఆ తర్వాత ఓ బిడ్డకు తల్లై హాయిగా పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు .. ఇక సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు..
ఇకపోతే మార్చిలో విడుదల కానున్న డూ ఔర్ డూ ప్యార్, తేరే క్యా హోగా లవ్లీ లు ఎప్పుడో సైన్ చేసినవే. తాజాగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. డల్లాస్‌లో సెటిల్ అయిపోయారని ఓ వార్త షికారు చేస్తుంది.. ఇక సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదని తెగేసి చెప్పేసింది.. మొత్తానికి ఇలియానా సినిమాలకు శుభం కార్డు పడి పోయింది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు తన ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది..