NTV Telugu Site icon

Madras High Court : ఆ ముగ్గురి కంటే ఇళయరాజా గొప్పవారేమి కాదు..

Whatsapp Image 2024 04 20 At 12.43.29 Pm

Whatsapp Image 2024 04 20 At 12.43.29 Pm

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన మ్యూజిక్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది .ఆయన మ్యూజిక్ వలనే చాలా సినిమాలు హిట్ అయ్యాయి .ఆయన పాటలు అంటే అప్పటి తరం నుంచి ఇప్పటి తరం వరకు నచ్చని వారు వుండరు.నేటి మ్యూజిక్ డైరెక్టర్స్ కు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారు…ఇళయరాజా గారు ఇప్పటి వరకు పలు భాషలలో దాదాపు వెయ్యికిపైగా చిత్రాలకు మ్యూజిక్ ను అందించారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే తాను మ్యూజిక్ అందించిన పాటలను వాడుకునే ఒప్పంద గడువు పూర్తి అయ్యిందని ఏకో రికార్డింగ్‌ వంటి  సంస్థలపై ఇళయరాజా కాపీ హక్కులను కోరుతూ చెన్నై హైకోర్టులో పిటిషన్‌ ను దాఖలు చేశారు. దీంతో ఆ సంస్థలు కూడా చెన్నై హైకోర్టులో రిట్‌ పిటిషన్ ను దాఖలు చేసారు.

తాజాగా ఈ కేసును విచారించిన చెన్నై హైకోర్టు ఇళయరాజా పాటలను ఉపయోగించుకునే హక్కు ఆ రికార్డింగ్‌ సంస్థలకు ఉందని తీర్పును ఇచ్చింది .అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఇళయరాజా తరఫున మరో పిటిషన్‌ ను దాఖలు చేశారు.ఈ నెల 10వ తేదీన న్యాయమూర్తులు ఆర్‌.మహాదేవన్ మరియు మహ్మద్‌ షఫీక్‌ సమక్షంలో ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఇళయరాజా తరఫు న్యాయవాది ఇళయరాజా గారు అందరికంటే ఎంతో గొప్పవారని వాదించారు.ఆ వాదనకు జస్టిస్ ఆర్‌.మహాదేవన్‌ కల్పించుకుని ‘సంగీత త్రిమూర్తులు’గా పేరుపొందిన సంగీత దర్శకులు ముత్తుస్వామి దీక్షితర్, త్యాగరాజర్, శ్యామశాస్త్రి అందరి కంటే గొప్పవారని తెలియజేసారు .ఇళయరాజా గారు వారికంటే గొప్పవారేమీ కాదని తెలిపారు . మీ వాదనను మేము అస్సలు అంగీకరించలేము’ అని అన్నారు.దీనితో ఈ కేసు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేయడం జరిగింది ..