Site icon NTV Telugu

Ilayaraaja: ‘ఇళయరాజా’ బయోపిక్ లో హీరో ధనుష్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది..

Ilayaraja

Ilayaraja

‘ఇళయరాజా’ సంగీతం అంటే చాలా మందికి ఇష్టం.. సంగీత ప్రపంచంలో ఈయన మకుటం లేని మహారాజు.. ఈయన సంగీతం అందించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. ఎన్ని ఏళ్లు వచ్చిన ఆ పాటలు ఇంకా జనాల నోట్లో వినిపిస్తున్నాయి.. ఒకమాటలో చెప్పాలంటే సంగీత బ్రహ్మ.. ఇళయరాజా 1970ల్లో సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టి తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో వందల సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు..

ఈ వయసులో కూడా సంగీతం పై మక్కువను వదులుకోలేదు.. పలు సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ సంగీత ప్రియులను అల్లరిస్తున్నారు.. ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఇళయరాజా బయోపిక్ సినిమా రాబోతుంది.. ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో హీరో ధనుష్ నటిస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.. అందులో ఇళయరాజా అనే టైటిల్ తోనే బయోపిక్ ప్రకటించారు. ది కింగ్ ఆఫ్ మ్యూజిక్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు.

ఆ పోస్టర్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.. ఇక ఈ సినిమాకు తమిళ స్టార్ డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కిస్తున్నాడు. ఇళయరాజా సినిమాని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీని తెరాకెక్కిస్తున్నారు.. అంతేకాదు ఈరోజు ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.. ఈ సందర్బంగా ధనుష్ మాట్లాడిన మాటలు అందరిని ఆకట్టుకున్నాయి.. త్వరలోనే సినిమా రెగ్యూలర్ షూట్ ను మొదలు పెట్టబోతున్నారని సమాచారం..

Exit mobile version