NTV Telugu Site icon

Hyderabad: వాహనంలో గంజాయి సరఫరాపై ఖండించిన ఐకియా..

Ikea

Ikea

హైదరాబాద్‌‌లోని టెలికాం నగర్‌, గచ్చిబౌలి ప్రాంతంలోని జీహెచ్‌ఎంసీ పార్కు ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో.. ఐకియా సరుకులు రవాణ చేసే వ్యాన్‌లో తనిఖీలు నిర్వహించగా 1.12 కేజీల గంజాయి పట్టుకున్నారు. ఐకియా వాహనాల డ్రైవర్లు గచ్చిబౌలి ప్రాంతంలోని ఉన్న వ్యక్తులకు గంజాయి తీసుకు వచ్చి ఇస్తుంటారు. గంజాయి అక్రమ రవాణదారులు ఫర్నీచర్‌ రవాణ చేసే వ్యాన్‌ డ్రైవర్లను వినియోగించుకున్నారు. ఈ క్రమంలో గంజాయి సరఫరా చేసిన మహేష్‌, సిద్ధు అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

Read Also: Canada: భారత్‌తో చెలగాటమాడిన కెనడా పరిస్థితి ఆగమాగం.. అమెరికా సాయం చేస్తుందా?

తాజాగా.. ఐకియా వాహనంలో గంజాయి సరఫరాపై యాజమాన్యం స్పందించింది. తమ వాహనాల్లో మత్తు పదార్థాలను తరలించడాన్ని తీవ్రంగా ఖండించింది. తమ కంపెనీ ఫర్నీచర్ హోం డెలివరీ చేసే ప్రక్రియ థర్డ్ పార్టీ వెండర్‌ ఆధీనంలో జరుగుతుందని ఐకియా క్లారిటీ ఇచ్చింది. ఈ ఘటనలో తమకు ఎలాంటి ప్రమేయం ఉండదని తెలిపింది. ఏ వస్తువైనా, పదార్థమైనా అక్రమంగా వినియోగించటం కానీ.. తరలించటం ఐకియా ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించదని పేర్కొంది. అలాంటి వాటికి మద్దతు ఇవ్వదని యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ ఘటనకు సంబంధించి అధికారుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని యాజమాన్యం తెలిపింది.

Read Also: Dulquer : పీరియాడిక్ చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంటోన్నస్టార్ హీరో