Site icon NTV Telugu

IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్ లో ఉరి వేసుకున్న విద్యార్థిని..

Suscide

Suscide

ఐఐటీ ఖరగ్‌పూర్ నాలుగో సంవత్సరం విద్యార్థిని హాస్టల్‌లో సోమవారం ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని దేవికా పిళ్లై (21)గా సీనియర్ పోలీసు అధికారి గుర్తించినట్లు తెలిపారు. హాస్టల్ భవనం సీలింగ్‌ కు విద్యార్థిని వేలాడుతూ కనిపించింది. ఇది ఆత్మహత్యా లేక మరేదైనా అన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఈ మరణంపై దర్యాప్తు మొదలు పెట్టారని అధికారి తెలిపారు.

Air India: ప్రయాణికుడి భోజనంలో ‘మెటల్ బ్లేడ్’.. ఎయిరిండియా విమానంలో ఘటన

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖరగ్‌పూర్ సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. ఈ వార్తను ధృవీకరిస్తూ, ఐఐటీ ఖరగ్‌పూర్ మూలం ప్రకారం, బయోటెక్నాలజీ విభాగంలో నాలుగో సంవత్సరం విద్యార్థి అయిన పిళ్లై ఉదయం సరోజినీ నాయుడు హాస్టల్ హాల్ పైకప్పుకు ఉరివేసుకుని కనిపించింది. దాంతో మేము పోలీసులకు సమాచారం అందించాము. అపై వారు మృతదేహాన్ని క్రిందికి తీసుకువచ్చారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత., మేము మరిన్ని వివరాలను అందిస్తామని కాలేజీ యాజమాన్యం తెలిపింది.ఈ సంఘటన ఇది ఆత్మహత్య కేసా.. కాదా.. అని తెలిపారు. కేరళకు చెందిన పిళ్లై నాలుగో సంవత్సరం విద్యార్థిని అని పోలీసు అధికారి తెలిపారు.

Exit mobile version