NTV Telugu Site icon

IIT Baba: ‘గతజన్మలో నేను కృష్ణుడిని..’ ఐఐటీ బాబా సంచలన వ్యాఖ్యలు

Iit Baba

Iit Baba

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఐఐటీ బాబా అభయ్ సింగ్ గురించి చర్చ జరుగుతోంది. మొదట ఐఐటీలో చదివి ఉద్యోగం చేసిన అభయ్ సింగ్ ఇప్పుడు బాబాగా అవతారమెత్తాడు. ఇప్పుడు అభయ్ సింగ్ ఐఐటీ బాబాగా ఇంటర్నెట్‌లో ఫేమస్ అయ్యాడు. ఆయన జీవితంతో పాటు ఆయన పలు వాదనలు కూడా చాలా చర్చనీయాంశమయ్యాయి. శ్మశానవాటికలో ఎముకలు కూడా తినేవాడని బాబా ఇటీవల పేర్కొనడం సంచలనం సృష్టించింది. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో అభయ్‌సింగ్ తన అభిప్రాయాలను వ్యక్త పరిచాడు. ఐఐటీ బాబా ఈ ఇంటర్వ్యూలో ఇలాంటి అనేక వాదనలు చేశారు. ఇవి ఆశ్చర్యం కలిగించాయి.

READ MORE: Kejriwal: డబ్బుతో ఓట్లు కొనేవారికి బుద్ధి చెప్పండి.. ప్రజలకు కేజ్రీవాల్ పిలుపు

అన్ని వీడియోల్లో పొడవాటి గడ్డంతో కనిపించే ఐఐటీ బాబా ఇప్పుడు క్లీన్ షేవ్ లుక్‌లో కనిపించాడు. అతను తన గత జన్మలో ఇప్పటికే చాలా పనులు చేశానని చెప్పాడు. తనకు పునర్జన్మ గురించి అన్నీ తెలుసని వివరించాడు. “నా గత జన్మలో నేను ఏమి చేశానో నాకు తెలుసు. నా పూర్వ జన్మలో నేను కృష్ణుడిని.” అని సమాధానమిచ్చాడు.

READ MORE: Bandi Sanjay : కరీంనగర్‌ను అభివృద్ధి చేయడమే నా ప్రధాన లక్ష్యం

ఐఐటీ బాబా తన చదువుల గురించి మాట్లాడుతూ.. “నేను చాలా క్లిష్టమైన గణిత ప్రశ్నలను కూడా పరిష్కరించేవాడిని. ఒకసారి పాఠశాలలో గురువు నాకు ఒక ప్రశ్న ఇచ్చారు. ఆ ప్రశ్న చాలా కష్టతరమైంది. దానిని కాపీ చేయడం సాధ్యం కాదు. నేను ఈ ప్రశ్నను చూశాను.. ఆ రోజు రాత్రి నిద్రించినప్పుడు నా కలలో ఈ ప్రశ్నను పరిష్కరించాను. మరుసటి రోజు నేను ఆ ప్రశ్నను పరిష్కరించి గురువుగారికి చూపించినప్పుడు.. అతను ఆశ్చర్యపోయాడు.” అని చెప్పాడు. ప్రజలు తనలో దేవుణ్ణి చూసేవారని ఐఐటీ బాబా చెప్పాడు. ” నాలో క్రీస్తుని, ఆది యోగిని, భైరవుడిని చూస్తున్నాను అని నా చుట్టుపక్కల వారు నాతో చెబుతుండేవారు. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడని నా నమ్మకం. నాలో కూడా దేవుడు ఉన్నాడు.” అని అభయ్ సింగ్ తెలిపాడు.