Site icon NTV Telugu

Lucknow: హాస్టల్ గదిలో ఐజీ కుమార్తె అనుమానాస్పద మృతి..

Ig Daughter

Ig Daughter

యూపీ రాజధాని లక్నోలోని లోహియా లా యూనివర్సిటీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హాస్టల్‌ గదిలో అపస్మారక స్థితిలో విద్యార్థిని గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని చూసిన తోటి విద్యార్థులు ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ.. అక్కడికి తీసుకెళ్లగానే వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. మృతురాలి తండ్రి ఒక ఐపీఎస్ అధికారి. అతను ఎన్ఐఏ (NIA)లో విధులు నిర్వహిస్తున్నాడు. ఐపీఎస్ కుమార్తె మరణ వార్తతో పోలీసు శాఖలో కలకలం రేగింది. పోలీసులు విద్యార్థి మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని.. పోస్టుమార్టంకు తరలించారు.

Read Also: GST Collection: ప్రభుత్వానికి ఆగస్టు నెల జీఎస్టీ ఎంత వచ్చిందో తెలుసా..?

ఎన్ఐఏలో ఐజీగా విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ సంతోష్ కుమార్ రస్తోగి కుమార్తె అనికా రస్తోగి (19), విద్యార్థిని లోహియా న్యాయ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ మూడవ సంవత్సరం చదువుతుంది. ఈ విద్యార్థిని యూనివర్సిటీ క్యాంపస్‌లోని హాస్టల్‌లో ఉంటోంది. అయితే.. శనివారం రాత్రి అనికా గది తలుపులు తీయకపోవడంతో ఆమె స్నేహితులు బలవంతంగా తలుపులు పగులగొట్టారు. లోపలి అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి చలించిపోయారు.

Read Also: Sologami: ఏడాది క్రితం తనను తాను పెళ్లి చేసుకున్న ఓ మహిళ.. ఇప్పుడు విడాకులు

అనికాను ఆమె స్నేహితులు ఎత్తుకుని నేరుగా అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. ఐపీఎస్ కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందన్న వార్త తెలియగానే పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కాగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. అనికా మృతిపై పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం తర్వాతే అనిక మృతిపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు.

Exit mobile version