పల్నాడు జిల్లా నరసరవుపేటలోని ఎస్పీ కార్యాలయంలో గుంటూరు రేంజ్ ఐజీ త్రివిక్రమ వర్మ,ఎస్పీ రవిశంకర్ రెడ్డి లు శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంలో ఐజీ త్రివిక్రమ వర్మ మాట్లాడుతూ…ఆదివారం జిల్లా వ్యాప్తంగా కానిస్టేబుల్ రాత పరీక్షలు జరుగుతున్నాయన్నారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రాలకు హాజరవ్వాలని ఆయన కోరారు.ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకూ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ పెన్నులు మాత్రమే వినియోగించాలని సూచించారు.
అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వచ్చేటప్పుడు సెల్ ఫోన్,డిజిటల్ వాచీలు,ఇయర్ ఫోన్స్ లాంటి పరికరాలు తీసుకుని రాకూడదని వివరించారు..పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి లలో మొత్తం 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు..పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.. మొత్తం 11,500 మంది పరీక్షకు హాజరవనున్నారన్నారు.. కానిస్టేబుల్ రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కేంద్రాలు దూరంగా ఉంటే వారు దిగే బస్టాండ్ ల వద్ద తమ శాఖ వాహనాలు ఏర్పాటు చేశామని అభ్యర్థులు వాటిల్లో పరీక్షా కేంద్రాలకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు..
అదేవిధంగా వచ్చే నెల 18న కోటప్పకొండలో జరగనున్న తిరుణాళ్ళ వేడుకలకు తీసుకోవలసిన జాగ్రత్తలపై పోలీసు అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసి చర్చించామని గుంటూరు రేంజ్ ఐజీ త్రివిక్రమ వర్మ వెల్లడించారు.. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బిందుమాధవ్, తదితరులు పాల్గొన్నారు.
Read Also: Spring Fields: 800 ఏళ్ల ఇస్లామిక్ స్వర్ణయుగాన్ని ప్రదర్శించిన స్ప్రింగ్‌ఫీల్డ్స్ ఇన్‌స్టిట్యూట్