NTV Telugu Site icon

IFFI 2024 Winners: అట్టహాసంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు.. విజేతలు వీరే

Iffi 2024

Iffi 2024

IFFI 2024 Winners: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2024 ముగింపు వేడుక గురువారం (నవంబర్ 28) నాడు అట్టహాసంగా ముగిసాయి. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ పండుగ గురువారం రాత్రి గోవాలో ముగిసింది. ఈ వేడుకలో బాలీవుడ్, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పండుగ చివరి రోజున ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2024 విజేత జాబితాను ప్రకటించారు. ఇందులో బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సీని “ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అఫ్ ది ఇయర్” గౌరవంతో సత్కరించారు.

Also Read: LAVA Yuva 4: వావ్.. తక్కువ ధరకే ఇన్ని ఫీచర్లా? మార్కెట్లోకి వచ్చేసిన లావా స్మార్ట్‌ఫోన్

సౌల్ బ్ల్యూవెట్ దర్శకత్వం వహించిన లిథువేనియన్ చిత్రం ‘టాక్సిక్’ 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో గోల్డెన్ పీకాక్ అవార్డును గెలుచుకుంది. ఉత్తమ నటి (మహిళ) అవార్డును ‘టాక్సిక్’లో తమ అద్భుతమైన నటనకు గాను వెస్టా మటులైతే (Vesta Matuliyte), ఇవా రూపాయికైతే (Iva Rupeikaite) లకు సంయుక్తంగా గెలుచుకున్నారు. మోడలింగ్ స్కూల్‌కు వెళ్లే ఇద్దరు 13 ఏళ్ల బాలికల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అలాగే 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ‘హోలీ కౌ’ చిత్రానికి గానూ ఫ్రెంచ్ దర్శకుడు లూయిస్ కోర్వోసియర్ స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు. ఫ్రెంచ్ చిత్రం ‘హోలీ కౌ’లో అద్భుత నటనకు గాను ‘క్లెమెంట్ ఫావెయు’ కు ఉత్తమ నటుడు అవార్డు లభించింది. అలాగే, సారా ఫ్రైడ్‌ ల్యాండ్ రచన, దర్శకత్వం వహించిన అమెరికన్ డ్రామా చిత్రం ‘ఫేమిలియర్ టచ్’ ఉత్తమ తొలి చలన చిత్ర అవార్డును అందుకుంది. మరోవైపు అవినాష్ ధర్మాధికారి దర్శకత్వం వహించిన ‘లంపాన్’ బెస్ట్ వెబ్ సిరీస్ (OTT) టైటిల్‌ను గెలుచుకుంది.

Also Read: Train Ticket Name Change: బుకింగ్ చేసిన రైలు టికెట్‭లో పేరును ఎలా మార్చుకోవాలంటే?

ప్రఖ్యాత ఫిల్మ్ మేకర్ ఫిలిప్ నోయిస్‌కు ప్రతిష్టాత్మక IFFI ‘సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు లభించింది. ఆయన అసాధారణ సహకారం, ఆలోచన రేకెత్తించే కథలు ఇంకా ప్రపంచ సినిమాపై అతని శాశ్వత ప్రభావం కోసం ఈ గౌరవంతో సత్కరించారు. అలాగే రొమేనియాకు చెందిన బొగ్దాన్ మురేసానుకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు లభించింది. ‘ది న్యూ ఇయర్ దట్ నెవర్ కేమ్’ చిత్రానికి గానూ ఆయనఈ అవార్డు అందుకున్నారు. ఇకపోతే
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2024 విజేతల జాబితా ఇలా ఉంది.

* గోల్డెన్ పీకాక్ ఉత్తమ చిత్రం: టాక్సిక్ (లిథువేనియన్ భాష).

* ఉత్తమ నటుడు: క్లెమెంట్ ఫావో (హోలీ కౌ).

* ఉత్తమ నటి: వెస్టా మటులియెట్ మరియు ఎవా రూపాయికైతే (టాక్సిక్).

* ఉత్తమ దర్శకుడు: బొగ్దాన్ మురేసాను (ది న్యూ ఇయర్ దట్ నెవర్ కేం).

* ప్రత్యేక జ్యూరీ అవార్డు: లూయిస్ కోర్వోసియర్ (హోలీ కౌ).

* ప్రత్యేక ఉత్తమ నటుడు: ఆడమ్ బెస్సా (నేను ఎవరికి చెందినవాడిని).

* ఉత్తమ వెబ్ సిరీస్: లంపన్ (మరాఠీ భాష).

* ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా ఉత్తమ డెబ్యూ: సారా ఫ్రైడ్‌ల్యాండ్ (ఫేమిలియర్ టచ్).