NTV Telugu Site icon

Google storage Full: మీ గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయిందా.. ఇలా చేయండి..?

Google

Google

Google storage Full: ఆండ్రాయిడ్‌ ఫోన్లు, కంప్యూటర్లు వాడే వారందరికీ గూగుల్‌ స్టోరేజీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అసవరం లేదు.. గూగుల్‌ సర్వీసులు వినియోగించేవారందరికీ 15జీబీ కాంప్లిమెంటరీ డేటాను గూగుల్‌ అందజేస్తుంది. గూగుల్‌ డ్రైవ్‌, జీమెయిల్‌, గూగుల్‌ ఫొటోస్‌ లాంటి సర్వీసులన్నింటికీ ఈ స్టోరేజీనే ఆధారంగా ఉంటుంది. దీంతో చాలా మందికి ఈ స్టోరేజీ ఫుల్‌ చూపిస్తుంది. ఒకవేళ అదనపు స్టోరేజీ కావాలంటే గూగుల్‌ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సిన పరస్థితి ఏర్పాడుతుంది. నెలకు లేదా ఏడాదికి సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు చెల్లించాల్సి ఉండనుంది. కానీ, కొన్ని టిప్స్‌ పాటించడం వల్ల మరి కొంత కాలం పాటు ఎలాంటి డబ్బులూ చెల్లించకుండానే మీ గూగుల్ స్టోరేజీని నిర్వహించుకొవచ్చు.

Read Also: Uddhav Thackeray: సీఎం అభ్యర్థి ఎవరైనా వారికి మద్దతు ఇస్తా.. ఠాక్రే సంచలన వ్యాఖ్యలు..

అయితే, గూగుల్‌ స్టోరేజీని క్లీనప్‌ చేయడానికి గూగుల్‌ డ్రైవ్‌, గూగుల్‌ ఫొటోస్‌, జీమెయిల్‌ లాంటి సర్వీసుల్లో ఉన్న అనవసరమైన డేటాను రిమూవ్ చేయాలి.. ఇందుకోసం కొన్ని ఫైల్స్‌ డిలీట్‌ చేయాలి.. ఈ పని త్వరగా, సులువుగా పూర్తి కావాలంటే మొబైల్‌ ఫోన్ కంటే కూడా డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌ వాడటం మంచిది అన్నారు. ఇందుకోసం ముందుగా గూగుల్‌ వన్‌ స్టోరేజీ మేనేజర్‌కి వెళితే దేనికంత స్టోరేజీ అవుతోందో మనకు చూపిస్తుంది. ఏయే సర్వీసుల్లో పెద్ద పెద్ద ఫైల్స్‌ ఉన్నాయో రివ్యూ చేసుకోవచ్చు.. దాని ఆధారంగా ఆయా సర్వీసులపై క్లిక్‌ చేస్తే డిలీట్‌ చేసే ఫైల్స్‌ కనిపిస్తాయి. వాటిని ఈజీగా డిలీట్‌ చేయొచ్చు అన్నమాట.

Read Also: Hardik Pandya-Jasmin Walia: హార్ధిక్ పాండ్యా, జాస్మిన్ వాలియాతో డేటింగ్ రూమర్స్.. ఫొటో వైరల్

అలాగే, మనం నిత్యం ఎన్నో వెబ్‌సైట్లను ఓపెన్ చేస్తుంటాం.. అవి ఎప్పటికప్పుడు ప్రమోషనల్‌ మెయిల్స్‌ పంపిస్తాయి.. దీంతో మన జీమెయిల్‌ ఇన్‌బాక్స్‌ నిండిపోతుంది.. ఇలాంటి మెయిల్స్‌ను తొలగించడంతో స్పేస్‌ను ఏర్పడుతుంది. దీంతో పాటు స్టోరేజీని క్లీన్‌ చేయడంలో భాగంగా పాత ఇ-మెయిల్‌ను తొలగించడం అన్నింటికంటే ఉత్తమమైన మార్గంగా చెప్పొ్చు. వీటితో పాటు మనకొచ్చే లేదంటే మనం పంపించే వాటిలో కొన్ని పెద్ద సైజు ఈ-మెయిల్స్‌ ఉంటాయి. వాటిని తొలగించడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ స్పేస్‌ను క్రియేట్‌ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

Read Also: Demonte Colony 2: వణికి పోవడానికి రెడీ అవ్వండి.. “డిమాంటీ కాలనీ 2” వచ్చేస్తోంది!

ఇక, గూగుల్‌ డ్రైవ్‌ స్టోరేజీలో ఎక్కువ భాగం ఆక్రమించే వాటిలో గూగుల్‌ ఫొటోస్‌ తొలి స్థానంలో ఉంటుంది. ఇందులో ముందుగా అవసరం లేని వీడియోలను డిలీట్ చేయడం వల్ల ఎక్కువ ఫ్రీ స్పేస్‌ను పొందవచ్చు.. అలాగే డూప్లికేట్‌ ఇమేజ్‌లను డిలీట్‌ చేయడంతో స్టోరేజీ ఖాళీ అవుతుంది. అలాగే, మనకు రోజువారీ జీవితంలో అవసరం అయిన పీడీఎఫ్‌లను, డాక్యుమెంట్లను గూగుల్‌ డ్రైవ్‌లో సేవ్ చేస్తాం.. ఈ- మెయిల్‌ తరహాలో 5 ఎంబీ కంటే ఎక్కువ సైజున్న ఫైల్స్‌ను తొలగించుకునే అవకాశం ఉంది.

Read Also: Jammu Kashmir Elections: 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు..

కాగా, అనవసరమైన ఫైళ్లన్నీ తొలగించినా ఇంకా స్టోరేజీ సరిపోలేదనుకోండి.. లార్జ్‌ ఫైల్స్‌ను మీ డెస్క్‌టాప్‌లో డౌన్‌లోడ్‌ చేసి.. ఆపై గూగుల్‌ స్టోరేజీలో డిలీట్‌ చేస్తే.. ఒకే తరహా ఫైల్స్‌ (వీడియోలు, పీడీఎఫ్‌లు) జీప్, ఆర్ఏఆర్ ను ఉపయోగించి కంప్రెస్‌ చేసి అప్‌లోడ్‌ చేయడంతో స్టోరేజీని కొంత వరకు తగ్గించకోవచ్చు. కొందరు కుటుంబ సభ్యుల ఫోన్లకూ ఒకటే గూగుల్‌ అకౌంట్‌ను వినియోగిస్తారు.. దీని వల్ల రెండు ఫోన్లలోని డేటా బ్యాకప్‌ అవ్వడంతో స్టోరేజీ నిండిపోతుంది. ఒకవేళ మీ గూగుల్ స్టోరేజీ నిండిపోవడానికి అలాంటి కారణం ఏదైనా ఉంటే.. వెంటనే ఆ అకౌంట్‌కు వేరే గూగుల్‌ అకౌంట్‌ను క్రియేట్ చేయడం ఉత్తమం.