NTV Telugu Site icon

IRCTC: ట్రైన్లో సైడ్ లోయర్ బెర్త్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా.. ముందు ఇది తెలుసుకోండి..?

Irctc

Irctc

రైలులో ప్రయాణించేటప్పుడు సుఖంగా, సౌకర్యవంతంగా ప్రయాణం అందరూ కోరుకుంటారు. అందుకోసమని ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు లోయర్ బెర్త్ కోసమే చూస్తారు. అక్కడేతేనే ఏం చక్కా విండో పక్కన కూర్చుని హ్యాపీగా జర్నీని ఆస్వాదిస్తారు. అంతేకాకుండా.. బోగీలో నడిచేందుకు కూడా ఫ్రీగా ఉంటుంది. ఇక.. మిడిల్ లేదా అప్పర్ బెర్త్ బుక్ చేసుకుంటే, పైకి ఎక్కి పడుకోవడం.. లేదంటే ఫ్లోర్ పై నిలబడాలి అన్నట్లు ఉంటుంది. అందుకే ప్రయాణికులు ఎక్కువగా లోయర్ బెర్త్ నే ఎంచుకుంటారు. అందులో సైడ్ లోయర్ బెర్త్ కు మరీ డిమాండ్ ఎక్కువ. అందులో అయితే.. ఎవరితో ఇబ్బందులు

Committee Kurrollu: ‘కమిటీ కుర్రోళ్ళు’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం

ఐఆర్‌సీటీసీలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు చాలా మంది లోయర్ బెర్త్ బుక్ చేసుకోవడానికి ఇష్టపడతారు. లోయర్ బెర్త్‌లో కిటికి పక్కన కూర్చుని ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ.. అవసరమైనప్పుడు ఫ్రీగా బోగీలో నడవడానికి వీలుంటుంది. అదే మిడిల్ లేదా అప్పర్ బెర్త్ విషయానికి వస్తే అయితే.. పైనకు ఎక్కి పడుకోవాలి, లేదంటే ఫ్లోర్ పై నిలబడాలి అన్నట్టుగా ఉంటుంది. అందుకే లోయర్ బెర్త్‌కు డిమాండ్ ఎక్కువ. ఇందులో సైడ్ లోయర్ బెర్త్‌కు మరీ ఎక్కువ. ఎందుకంటే ఇది ఎవరితోనూ డిస్టర్బెన్స్ ఉండదు. అందుకోసమని చాలా మంది ఈ సైడ్ లోయర్ బెర్త్ కావాలని చూస్తారు. అయితే.. బెర్త్ విషయంలో ఐఆర్‌సీటీ కొన్ని నిబంధనలను రూపొందించింది. కొందరికి లోయర్ బెర్త్ కోసం రిజర్వేషన్ ఉంటుంది. అది ఎవరికో ఇప్పుడు తెలుసుకుందాం.

Heavy Rain : భాగ్యనగరంలో భారీ వర్షం.. కొట్టుకుపోయిన వాహనాలు

భారత రైల్వే శాఖ ప్రకారం.. స్లీపర్ క్లాస్‌లో సైడ్ లోయర్ బెర్త్ ఎక్కువగా వృద్ధులకు కేటాయిస్తుంది. అంతేకాకుండా.. 60 ఏళ్లు పైబడిన పురుషులు, 55 ఏళ్లు పైబడిన మహిళలకు ఈ బెర్త్ కేటాయిస్తారు. వారితో పాటు.. గర్భవతులు, వికలాంగులకు ఈ బెర్త్ ను కేటాయిస్తారు. ఇకపోతే.. వికలాంగులకు స్లీపర్ క్లాస్‌లో నాలుగు సీట్లు రిజర్వ్ అయి ఉంటాయి. అందులో రెండు కింది సీట్లు, రెండు పైన సీట్లు ఉంటాయి. థర్డ్ ఏసీలో రెండు సీట్లు, ఏసీ3 ఎకానమీలో రెండు సీట్లు వికలాంగులకు రిజర్వ్ చేస్తారు. అలాగే.. గరీబ్ రథ్‌లో కింద రెండు, పైన రెండు సీట్లు వికలాంగులకు కేటాయిస్తారు. అయితే.. సీనియర్ సిటిజన్లు, వికలాంగులు లేదా గర్భవతులకు టికెట్ బుకింగ్ సమయంలో అప్పర్ బెర్త్‌లు కేటాయిస్తే.. టీటీకి ఈ విషయం తెలియజేసి లోయర్ బెర్త్‌ను పొందవచ్చు. రైల్వే ప్రకారం.. సైడ్ లోయర్ బెర్త్ ప్రయాణికులు రాత్రి ఆ బెర్త్‌పై పడుకున్నా.. పగలు సమయంలో పై బెర్త్‌లో ఉన్న యాత్రికులు లోయర్ బెర్త్‌పై కూర్చోవచ్చు. RAC వారు కూడా పగలు సమయంలో లోయర్ బెర్త్ ప్రయాణికుడితో కలిసి కూర్చోవచ్చు. అయితే.. రైలు ప్రయాణం చేసేటప్పుడు మీకు సైడ్ లోయర్ బెర్త్ కావాలని అనుకుంటే.. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్‌కు వెళ్లి సరైన ఆప్షన్ ఎంచుకుని బుక్ చేసుకోవాలి. కాగా.. రైల్వే నిబంధనలకు లోబడి బెర్త్ కన్ఫామ్ చేస్తుంది.