Committee Kurrollu: ‘కమిటీ కుర్రోళ్ళు’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం
- ‘కమిటీ కుర్రోళ్ళు’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం
- సినిమాను నేచురల్‌గా తెరకెక్కించటానికి ఎంటైర్ టీమ్ పడ్డ కష్టం తెరపై కనిపించింది: మెగాస్టార్ చిరంజీవి
- సినిమా చూస్తున్నప్పుడు కొత్తవాళ్లు యాక్ట్ చేస్తున్నారనే విషయాన్ని మరచిపోయా: మెగాస్టార్ చిరంజీవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Megastar Chiranjeevi Lauds “Committee Kurrollu”: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను పరిచయం చేస్తూ ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు.ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల అవ్వగా. డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని వసూళ్లను రాబడుతోంది. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల ప్రశసంలను అందుకున్న ఈ సినిమాకు సెలబ్రిటీల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే సూపర్‌స్టార్ మహేష్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, స్టార్ డైరెక్టర్ సుకుమార్, క్రిష్, దేవిశ్రీప్రసాద్ ఇలా చాలా మంది కమిటీ కుర్రోళ్ళు టీమ్‌ను అభినందించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను ప్రత్యేకంగా వీక్షించి ఎంటైర్ టీమ్‌ను ప్రత్యేకంగా కలుసుకున్నారు.
Lavanya: రాజ్ తరుణ్ మగాడు కాదంటూ ప్రచారం.. లావణ్య సంచలన వ్యాఖ్యలు
Also Read
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
నిర్మాత నిహారిక కొణిదెల, దర్శకుడు యదువంశీతో పాటు చిత్రంలోని నటీనటులందరూ చిరంజీవిని కలుసుకున్నారు. వారందరితో చిరంజీవి ప్రత్యేకంగా ముచ్చటిస్తూ సక్సెస్‌లో భాగమైన ప్రతీ ఒక్కరిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా .. చిరంజీవి మాట్లాడుతూ మా నిహారిక నిర్మించిన ‘‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను చూశాను.. చాలా చక్కగా ఉంది. అందరూ కొత్త కుర్రాళ్లే. చాలా బాగా చేశారు. సినిమా చూస్తున్నప్పుడు కొత్తవాళ్లు యాక్ట్ చేస్తున్నారనే విషయాన్ని మరచిపోయాను. ఎమోషనల్ సీన్స్ చాలా చక్కగా పండాయి. నటీనటులందరూ కథానుగుణంగా మేకోవర్ అయిన తీరు అద్భుతం. సినిమాను నేచురల్‌గా చిత్రీకరించటం ఎంటైర్ టీమ్ పడ్డ కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే, అది తెరపై కనిపించింది. రీజనబుల్ బడ్జెట్‌లో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు యదువంశీకి ప్రత్యేకమైన అభినందనలు. దర్శకుడిగా తను చక్కటి ప్లానింగ్‌తో సినిమాలోని ప్రతీ సన్నివేశాన్నిముందుగా డిజైన్ చేసుకోవటం వల్ల బాగా తెరకెక్కించగలిగారు. రీసెంట్‌గా విడుదలైన సినిమాల్లో కమిటీకుర్రోళ్లు ముందంజలో ఉంటూ మంచి వసూళ్లను రాబడుతుంది. ఎంటైర్ టీమ్‌కు అభినందనలు’’ అన్నారు.
తాజావార్తలు
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
-
Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో…
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!