NTV Telugu Site icon

Health Tips: రోజూ ఉదయం వీటిని తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు..

Breakfast

Breakfast

ఈరోజుల్లో చాలా మంది రాత్రి లేటుగా పడుకుంటున్నారు.. ఉదయం లేటుగా లేస్తున్నారు.. అప్పుడు కూడా బద్ధకంగా ఉంటున్నారు.. ఉదయం తీసుకొనే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అల్పాహారం సరిగ్గా తీసుకోకపోతే, మీరు రోజంతా బద్ధకం మరియు అలసటతో ఉంటారు. నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో డైట్‌పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.. దాంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పొద్దున లేచిన తర్వాత ఉసిరి రసం తాగాలి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ కూడా బయటకు వెళ్లి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బలమైన రోగనిరోధక శక్తి శరీర వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. అదే విధంగా కలబంద జ్యూస్ ను కూడా తాగాలి.. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.. అందరి ఇళ్లలో కలబంద మొక్క ఉంటుంది. దీని జ్యూస్ తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇక బొప్పాయి జ్యూస్ కూడా చాలా మంచిదే.. దాన్ని ఉదయం తాగితే యాక్టివ్ గా ఉంటారు..

అలాగే కొంతమంది వేడి నీటిని కూడా తాగుతారు.. వేడి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.. ఇకపోతే బాదం, వాల్‌నట్స్ మరియు పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ తినాలి. ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు డ్రై ఫ్రూట్స్ లో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి సరిపోతాయి. ఇవి మెదడును చురుకుగా ఉంచుతాయి. అలాగే తప్పనిసరిగా శరీరానికి శ్రమ అవసరం ఉంటుంది.. వ్యాయామాలు కూడా తప్పనిసరిగా అవసరం.. ఇవన్నీ ఫాలో అయితే మాత్రం రోజంతా మీరు యాక్టివ్ గా ఉంటారు..