Site icon NTV Telugu

Viral News: సినిమాకెళ్తే బిల్లు వాచిపోయిందిగా..వైరల్ అవుతున్న న్యూస్!

Movie

Movie

Viral News: ఒకప్పుడు సినిమా చూడాలంటే ఎక్కువగా థియేటర్ కు వెళ్లి చూసేవారు. అయితే ఇప్పుడున్న రోజుల్లో థియేటర్ కు వెళ్లే అంత సమయం లేదు.. అంత ఇంట్రెస్ట్ కూడా చూపించడం లేదు. ఎందుకంటే బిజీ లైఫ్ గడుపుతున్న జనాలు.. తమ తమ పనులు చూసుకునే సరికే సమయం గడిచిపోతుంది. ఏదో తమ ఇష్టమైన హీరో అయితేనో లేదంటే.. వారికి వెళ్లాలని అనిపిస్తే తప్పా.. థియేటర్ ముఖం చూడటం లేదు. మరో ముఖ్యమైన విషయమేంటంటే.. కరోనా వచ్చినప్పటి నుంచి సినిమా థియేటర్లో సినిమాలు చూడటమే తక్కువ అయిపోయింది. అంతేకాకుండా ఓటీటీ ప్లాట్ ఫాం వచ్చిన దగ్గరి నుంచి.. ఎక్కువ దానికే ప్రభావితమయ్యారు.

Dowry Harassment: పెళ్లికి ముందే వరకట్న వేధింపులు.. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే..

అయితే అసలు విషయానికొస్తే.. ఓ సినిమా ప్రేమికుడు తాజాగా ఓ సినిమా చూద్దామని థియేటర్ కు వెళ్లాడు. అయితే ఇంటర్వెల్ టైంలో ఆ వ్యక్తి పాప్‌కార్న్‌ (popcorn) కొన్నాడు. ఆ తర్వాత వచ్చిన బిల్లును చూసి ఆశ్చర్యపోయాడు. మాములుగా అయితే పాప్ కార్న్ కొంటే ఎంతవుద్ది.. 50 రూపాయలు. అయితే ఆ వ్యక్తి పాప్ కార్న్ కొంటే 460 రూపాయలు అయింది. దాంతో పాటు కూల్ డ్రింక్ కు 360 రూపాయలు బిల్ వేశారు. ఈ ఘటన నోయిడాలోని పీవీఆర్ లో జరిగింది.

Tomato Price: రోజురోజుకు పెరుగుతున్న టమాటా ధరలు.. ఇప్పుడు కేజీ 120 కాదు 160..!

బిల్లును చూసి కంగుతిన్న ఆ వ్యక్తి.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. చెబితే ఎవరూ నమ్మరని ట్విటర్‌ లో తనకు వేసిన బిల్లును చూపించాడు త్రిదీప్ అనే వ్యక్తి. ఒక్క సినిమా కోసం తాను చేసిన ఖర్చుతో ఏడాది పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో కావాల్సినన్ని సినిమాలు చూడొచ్చని క్యాప్షన్‌ పెట్టాడు. ఇదిగో ఇలా దోచుకుంటున్నారనే థియేటర్ల వైపుకు జనం రావడం లేదని రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు పలు రకంగా కామెంట్స్ చేస్తున్నారు. సినిమా థియేటర్లలో ఇంత రేట్లు ఉంటే ఎలా వెళతామని ఒకరంటే.. ఇంటికెళ్లి భోజనం చేయండి, పాప్‌కార్న్‌ డబ్బులను ఆదా చేసుకోండి అని మరొకరు అన్నారు. థియేటర్‌కు వెళ్లి సినిమా మాత్రమే చూడండి. తినడం కోసం మాత్రం వెళ్లొద్దంటూ ఇంకొకరు కామెంట్స్ చేశారు.

Exit mobile version