Site icon NTV Telugu

Kavitha: కేసీఆర్ కూతురైన నా లేఖనే బయటికి వచ్చిందటే… పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి?

Kavitha1

Kavitha1

కేసీఆర్ కూతురైన నేను రాసిన లేఖనే బయటికి వచ్చిందటే… పార్టీలో ఇతర సామాన్యుల పరిస్థితి ఏమిటి? అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆమె ఎయిర్‌పోర్టులో తన తండ్రికి రాసిన లేఖపై స్పందించారు. నేను కేసీఆర్ కు లేఖ ద్వారా వ్యక్త పర్చిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏమీ లేదని స్పష్టం చేశారు. లేఖ బహీర్గతం కావడం బాధాకరమన్నారు. లేఖ బహీర్గతం కావడం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సంబరపడుతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఆగమైనట్లు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారని.. మా నాయకుడు కేసీఆర్ యే అని కుండ బద్దలు గొట్టారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది, పార్టీ కూడా మందుకెళ్తుందని స్పష్టం చేశారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకొని కోవర్టులను పక్కకు జరుపుకొని ముందుకెళ్తే పార్టీ పది కాలాల పాటు చల్లగా ఉంటుందని కవిత అన్నారు.

READ MORE: Off The Record: ఆ మాజీ మంత్రి వ్యవహారం వైసీపీలో బూమ్ రాంగ్ అయ్యిందా..?

మరోవైపు.. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 14 లోని ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద తెలంగాణ జాగృతి నేతల, అభిమానుల కోలాహలం నెలకొంది. అమెరికాలో కొడుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఇంటికి వస్తున్న కవితకు తెలంగాణ జాగృతి కార్యకర్తల ఘన స్వాగతం లభించింది. జాగృతి నేతలు పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.

READ MORE: Kavitha: ఎయిర్‌పోర్టు వద్ద “టీం కవితక్క అంటూ” కటౌట్లు.. కనిపించని కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు..!

Exit mobile version