Site icon NTV Telugu

Komatireddy: కేసీఆర్ కాంగ్రెస్ను టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులను కూల్చేస్తాం..

Komati Reddy

Komati Reddy

Komatireddy Venkat Reddy: సంగారెడ్డిలో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాధ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులను కూల్చేస్తామన్నారు. దేశంలోనే దరిద్రమైన పాలన అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది.. రేవంత్ రెడ్డి ముఖం చూడలేక కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు అంటూ మండిపడ్డారు. మేము గేట్లు తెరిస్తే.. ఎమ్మెల్యేలుగా ఉన్న సభ్యులు తప్ప బీఆర్ఎస్ లో ఎవరూ మిగలరు అని ఆయన చెప్పుకొచ్చారు. మరో 3 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని తెలిపారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి.. రాజకీయాల్లో స్వతంత్రంగా ఎదిగిన రేవంత్ రెడ్డి.. రాష్టానికి సీఎం అయ్యారు.. మెదక్ లో వెయ్యి కోట్లు ఖర్చు చేసినా కూడా బీఆర్ఎస్ గెలవదు.. కేసీఆర్ కుటుంబాన్ని చూస్తుంటే జాలీ వేస్తుంది అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Read Also: Salman Khan : లక్ష అడ్వాన్స్, మూడు సార్లు రెక్కీ, 13కి.మీ దూరంలో గది.. సల్మాన్ పై కాల్పుల ప్లాన్ ఇదే

సొంత బిడ్డ జైలుకు వెళ్తే.. కేసీఆర్ తాను చేసిన పాపాలకు ప్రయశ్చితం చేసుకోవాలి అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వ్యవహారంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకు వెళ్తారు.. రావులు అందరూ జైలుకు వెళ్తే చర్లపల్లి జైల్ సరిపోదు.. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్ను పోటు పొడిచిన వ్యవహారంలో కేసీఆర్ కూడా అన్నారు అని ఆరోపించారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లు గెలుచుకుంటుంది అని మంత్రి కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.

Exit mobile version