NTV Telugu Site icon

Delhi Flood: ఇందిరాగాంధీ ఆ నిర్ణయం తీసుకోకుండే నేడు నోయిడా, ఘజియాబాద్ మునిగిపోయేవి

Indira Gandhi

Indira Gandhi

Delhi Flood: దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులుగా వర్షాలు కురవకపోయినా యమునా నది నీటిమట్టం రికార్డు స్థాయిలోనే కొనసాగుతోంది. గురువారం పల్లా గ్రామ పరిసర ప్రాంతాల్లో యమునా నీటి మట్టం 212.70 మీటర్లకు చేరుకోగా, ఢిల్లీ రైలు వంతెన వద్ద నీటి మట్టం ఉదయం 208.41 వద్ద నమోదైంది. రాజధానిలో యమునా నది నీటిమట్టం పెరిగిన తీరు, 1978 నాటి వరదల జ్ఞాపకాలను గుర్తకు తెచ్చింది. ఆ సమయంలో యమునా నీటిమట్టం 207.49 మీటర్లకు చేరుకుంది.

1978లో వచ్చిన ప్రమాదకరమైన వరదల తర్వాత ఇందిరాగాంధీ కెనాల్‌ ప్రాజెక్టు పనులు ఎలా జరిగాయో, దాని ఫలితమే నేడు నోయిడా, గ్రేటర్‌ నోయిడా, ఘజియాబాద్‌ ముంపునకు గురికాకుండా కాపాడింది. 45 ఏళ్ల క్రితం సంభవించిన వరదల తర్వాత యమునా నదిపై ఆనకట్టను నిర్మించారు. ఇది యమునా నది ఒడ్డున నిర్మించబడింది. దాదాపు 22 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ డ్యామ్ నిర్మాణానికి పెద్ద రాళ్లు, మట్టిని ఉపయోగించారు. యమునా నది వేగవంతమైన ప్రవాహాన్ని ఆపడానికి ఈ ఆనకట్ట రూపొందించబడింది. ఈ రోజు ఈ డ్యామ్ ఢిల్లీలో వరదలను నివారించడంలో సహాయకరంగా ఉంది.

Read Also:Jailer: రజినీ కా హుకుమ్… జారీ అయ్యేది ఎప్పుడు?

1978లో వరదల కారణంగా ఢిల్లీలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ మొత్తం నీటిలో మునిగిపోయింది. టెలిఫోన్ లైన్లు తెగిపోయి విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది. ఢిల్లీలోని మహారాణి బాగ్‌, ఓఖ్లా, ఆజాద్‌పూర్‌, మోడల్‌ టౌన్‌ వంటి ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఆ సమయంలో కూడా హత్నికుండ్ బ్యారేజీ నుంచి దాదాపు 7 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

ఇంతకు ముందు కూడా ఢిల్లీలో వరదలు వస్తూనే ఉన్నాయి, కానీ 1978 వరదల వల్ల సంభవించిన విధ్వంసం గురించి ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. ఆ సమయంలో ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయి కంటే 2.66 మీటర్ల ఎత్తులో ఉంది. ఆ సమయంలో యమునా నీటిమట్టం తొలిసారిగా 207.49 మీటర్ల మార్కును తాకింది. అప్పటి నుండి యమునా నీటి మట్టం 207 మీటర్ల మార్కును కేవలం రెండుసార్లు మాత్రమే దాటింది. 2010లో తొలిసారిగా యమునా నీటిమట్టం 207.11 మీటర్లకు చేరుకోగా, 2013లో రెండోసారి 207.32 మీటర్లకు చేరుకుంది. యమునా నదిపై ఉన్న పాత రైలు వంతెన ఎత్తును బట్టి 1866-67లో ఢిల్లీలో డేంజర్ మార్క్ 207.73 మీటర్ల వద్ద ఉంచబడింది.

Read Also:Madhapur DCP Shilpavalli: దుర్గం చెరువు ఘటనలు.. రెండేళ్లలో ఎనిమిది మంది సూసైడ్

Show comments