NTV Telugu Site icon

Manickam Tagore: కేంద్రంలో కాంగ్రెస్ ఆధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా..

Manickam Tagore

Manickam Tagore

Manickam Tagore: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచారని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాకూర్‌ విమర్శించారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ యువతకు ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యారని ఆరోపించారు. ఒంగోలులో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నాలుగున్నరేళ్ళలో చేసిందేమీ లేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ఆధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రానికి కావాల్సిన అన్నీ ప్రాజెక్టులు ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు. వైఎస్ షర్మిలకు కాంగ్రెస్‌లో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

Read Also: Swachh Survekshan: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అవార్డుల పంట

షర్మిలకు కాంగ్రెస్ పార్టీలోని ప్రతీ ఒక్కరూ సాదరంగా ఆహ్వానించారన్నారు. షర్మిలకు ఆంధ్ర ప్రదేశ్‌లో బాద్యతలు అప్పగిస్తాం.. మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరువచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని మాణిక్కం ఠాకూర్‌ వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఆయన మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం సాండ్, లాండ్, మైన్, వైన్‌లపై నడుస్తుందని ఆయన విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన అన్ని అవకతవకలపై విచారణకు కోరతామన్నారు.