NTV Telugu Site icon

Palnadu SP: పల్నాడులో 666 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తుల గుర్తింపు

New Project (32)

New Project (32)

సార్వత్రిక ఎన్నికలల్లో ఘర్షణలు జరిగిన 15సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని పల్నాడు ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. వివిధ కేసుల్లో 666మంది నేర చరిత్ర గల వ్యక్తులను గుర్తించామని పేర్కొన్నారు. రౌడీ షీటర్ల మీద ప్రత్యేక నిఘా పెట్టామని..చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జిల్లా బహిష్కరణ చేస్తామన్నారు. మాచర్ల, నరసరావుపేటలో పోలీస్ భద్రతను పెంచామని చెప్పారు. బైండొవర్ కేసుల్లో ముద్దాయిలను జరిమానా విధిస్తున్నామని పేర్కొన్నారు. భారీ భద్రత CRPS బలగాలతో పల్నాడులో భద్రతను పెంచామని వెల్లడించారు. ఈనెల 4వ తేదీన కౌంటింగ్ సమయం కావడంతో మరింత భద్రత పెంచామని.పల్నాడు జిల్లా లో పోలీసులంతా కౌంటింగ్ సమయంలో విధుల్లోనే ఉంటారని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు నాయకులు, పల్నాడు జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

READ MORE: IPL 2024 Final: ట్రోఫీతో కమిన్స్, శ్రేయాస్ ఫొటో షూట్.. పడవ, ఆటోలో మాములుగా లేదుగా

కాగా.. పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో ఈనెల 13, 14, 15 తేదీల్లో ఘర్షణలు జరిగాయి. నరసరావుపేటలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇరు పక్షాలు ఘర్షణ పడుతున్నా.. తక్కువ మంది ఉన్న పోలీసులు వీరిని నియంత్రించడానికి తీవ్రంగా శ్రమించారు. పోలీసులంతా ఎన్నికల విధుల్లో ఉండగా ఈ ఘర్షణలు పట్టణంలో తీవ్ర భయాందోళనలను కలిగించింది. మాచర్ల నియోజకవర్గంలో హింసకాండ సంభవించింది. ఈ ఘర్షణలను తీవ్రంగా పరిగణించిన ఈసీ ప్రత్యేక దర్యాప్తు బృందా ఏర్పాటు చేయగా.. మూడు రోజులు శ్రమించిన బృందం నివేదికను డీజీపీకి అందించింది. ఇదిలా ఉండగా.. ఎన్నికల కౌంటింగ్ రోజున మళ్లీ గొడవలు మొదలయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.