ICSE, ISC Results: ఐసీఎస్‌ఈ (పదోతరగతి), ఐఎస్‌సీ (12వ తరగతి) 2023 ఫలితాలను ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఫలితాలను https://cisce.org లేదా https:// results.cisce.org వెబ్‌సైట్లలో చూసుకోవచ్చని కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేషన్ ఎడ్యుకేషన్ (సీఐఎస్‌సీఈ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ శనివారం తెలిపారు. 10వ తరగతి లేదా ఐసీఎస్‌ఈ పరీక్షలు ఫిబ్రవరి 27న ప్రారంభమై మార్చి 29, 2023న ముగిశాయి. 12వ తరగతి లేదా ఐఎస్సీ పరీక్ష ఫిబ్రవరి 13న ప్రారంభమై మార్చి 31న ముగిశాయి.
Read Also: Drugs : దేశ చరిత్రలోనే భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టివేత.. విలువ వేలకోట్లు
ఈ ఏడాది 10, 12 తరగతులకు సంబంధించి 2.5 లక్షల మంది విద్యార్థులు సీఐఎస్‌సీఈ పరీక్షకు హాజరయ్యారు.పాఠశాలల ప్రిన్సిపాళ్లు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి తమ విద్యార్థుల ఫలితాలను పొందవచ్చని పేర్కొన్నారు. సందేహాలకు helpdesk@cisce.orgలో సీఐఎస్‌సీఈ హెల్ప్ డెస్‌ని, 18002032414 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. శుక్రవారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తరగతి 12వ తరగతి ఫైనల్ పరీక్షల ఫలితాలను మొత్తం 87.33 శాతంతో ప్రకటించిన విషయం తెలిసిందే.