Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ గురించి బ్రతకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు సాధించిన నటుడిగా ప్రస్తుతం నేషనల్ హీరోగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. పుష్ప 2 సినిమాతో కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డులను మాత్రమే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాడు. ఇకపోతే, అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ ను ఇష్టపడే వారు ఎందరో ఉన్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ వేసుకున్న టీ షర్ట్ సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Read Also: Pakistan: పాకిస్తాన్‌కి విదేశీ విమాన సంస్థల షాక్.. ప్రతీ నెలా మిలియన్ డాలర్ల నష్టం..
ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఉపయోగించి మనం వేసుకునే బట్టల పై కావలసిన కొటేషన్స్, బొమ్మలు ముద్రించి వాడుకోవడం చూస్తూ ఉంటాము. ఈమధ్య దుస్తులపై సినిమాల్లో బాగా వైరల్ అయినా డైలాగ్స్ తో టీషర్ట్స్ వస్తున్న సంగతి మనకు తెలిసిందే. టీ షర్ట్స్ పై బాగా పాపులర్ అయిన డైలాగ్స్, అలాగే కొన్ని ట్రెండీ లుక్స్ ఫోటోలు ప్రింట్ చేసి దానిని మార్కెట్లో విడుదల చేయడం మనం గమనిస్తూనే ఉన్నాము.
అయితే, తాజాగా బన్నీ ఒక వైట్ టీషర్ట్ వేసుకొన్న దానిపై బ్రహ్మానందం ఇది వరకు సినిమాలో చెప్పిన “నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా” అనే డైలాగ్ ఇంగ్లీషులో రాసి ఉంది. ఈ టీ షర్టు పై హాస్యబ్రహ్మగా పేరుపొందిన బ్రహ్మానందం ఫోటోలు ఉండి, ఆయన చెప్పిన డైలాగ్ కింద ఇంగ్లీషులో రాసి ఉంది. దీంతో ప్రస్తుతం బన్నీ వేసుకున్న టీ షర్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Nellore Peddareddy Taluka 🔥 pic.twitter.com/QfpikNU8Rb
— At Theatres (@attheatres) May 2, 2025
