Site icon NTV Telugu

Allu Arjun: అల్లు అర్జున్ పుట్టినరోజున అదిరిపోయే అప్‌డేట్స్.. ‘AA22’ టైటిల్ ఫిక్స్?

Alluarjun

Alluarjun

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గీతా ఆర్ట్స్ సంస్థ “సినిమా స్థాయిని నిశ్శబ్దంగా పెంచిన వ్యక్తి.. తనకంటూ ఒక సొంత స్టైల్ సెట్ చేసుకున్న మనిషి” అంటూ బన్నీని కొనియాడుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. కేవలం శుభాకాంక్షలే కాదు, ఈ పుట్టినరోజున ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చేలా మేకర్స్ ప్లాన్ చేశారు.

Also Read : Sumanth: మృణాల్‌కు క్షమాపణలు చెప్పిన సుమంత్..!

అట్లీ (Atlee) దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోతున్న తన 22వ సినిమా (AA22xA6) టైటిల్ పోస్టర్‌ను ఈరోజే (ఏప్రిల్ 8) ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నారు. సుమారు రూ. 800 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తుండగా, బన్నీ కెరీర్‌లోనే మొదటిసారి మల్టిపుల్ రోల్స్ చేయబోతున్నట్లు టాక్. ఇప్పటికే ‘పుష్ప 2’ తో రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన బన్నీ, ఇప్పుడు అట్లీతో కలిసి మరో పాన్ ఇండియా విజువల్ వండర్ సృష్టించేందుకు సిద్ధమయ్యారు.

వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా, త్రివిక్రమ్ శ్రీనివాస్, లోకేష్ కనగరాజ్ వంటి దిగ్గజ దర్శకులతో బన్నీ వరుస ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమాన సంఘాలు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ‘పుష్ప: ది రాంపేజ్’ (Pushpa 3) గురించి కూడా ఏమైనా చిన్న క్లూ దొరుకుతుందేమో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

Exit mobile version