NTV Telugu Site icon

Ice Cream: అరె ఏంట్రా ఇది.. పచ్చిమిర్చితో ఐస్ క్రీం ఏంటయ్యా?

Green Chilli

Green Chilli

Ice Cream: పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఎంతో ఆనందంగా ఆస్వాదించే ఆహార పదార్థాలలో ఐస్ క్రీమ్ కూడా ఒకటి. కేవలం ఇంట్లో మాత్రమే తినడం కాకుండా.. ఎక్కడికైనా బయట ఫంక్షన్లకు కానీ., పెళ్లిళ్లకు కానీ.. వెళ్లిన సందర్భంలో భోజనం తర్వాత ఐస్ క్రీం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మారుతున్న కాలంతో పాటు ఐస్ క్రీమ్ లలో కూడా అనేక మార్పులు వచ్చాయి. చాక్లెట్, వెనీలా, సీతాఫల్, స్ట్రాబెరీ, ఫ్రూట్ అండ్ నట్స్ ఇలా కొన్ని వందల రకాలు ఐస్క్రీమ్ లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. దీంతో ఎవరికి ఇష్టమైన అభిరుచి ఎంచుకొని వారు ఐస్ క్రీమ్ ఆనందిస్తున్నారు. తాజాగా ఓ వింత ఐస్ క్రీం కాంబినేషన్ సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇలా కూడా ఐస్ క్రీమ్ చేసి తినవచ్చా అనే ఆలోచన మీ మదిలో రావచ్చు. మరి ఆ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూద్దామా..

Janvi Kapoor : ఐఫాలో జాన్వీ పాప వేసుకున్న నెక్లెస్ ఎన్ని కోట్లో తెలుసా ?

వీడియోలో ఎవరికి ఊహగా ఉందని చిల్లి ఐస్ క్రీమ్ కాంబినేషన్ చేయడం మనం చూడవచ్చు. ఈ వీడియోలో ఓ వ్యక్తి రెండు పచ్చిమిరపకాయలను తీసుకొని అందులో పాలు కలుపుతూ ఐస్ క్రీం డెజర్ట్ ను తయారు చేయడం మనం వీడియోలో చూడవచ్చు. ఐస్ క్రీం తయారీలో ఓ వ్యక్తి పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి., దాని పై ఆకుపచ్చ సాస్ వేసి వాటిని తయారు చేసి అందులో కాస్త పాలు.. అలాగే మిల్క్ ఐస్ క్రీం పోసాడు. ఇంకేముంది ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని అదేపనిగా కలుపుతూ మిక్స్ చేయడం మనం చూడవచ్చు. అలా కొద్దిసేపు తర్వాత ఆ మిశ్రమం కాస్త గుజ్జుగా తయారుచేసి దాన్ని రోల్స్ లా చేసి మళ్లీ వాటిపై ఆకుపచ్చ రంగు కలర్ సాస్ వేయడం చూడవచ్చు.

Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేడు తులం ఎంతుందంటే?

ఇక ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇందులో కొందరైతే అసలు ఎలా వస్తాయి అండి ఇలాంటి ఆలోచనలు అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. తాను చాలా రకాల ఐస్ క్రీం ఫ్లేవర్స్ ను రుచి చూశాను కానీ., ఇలాంటి డెజర్ట్ ఇంతవరకు నేను రుచి చేయలేదంటూ తప్పకుండా ట్రై చేస్తాను అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే., ఈ డెజర్ట్ తయారుచేసిన అతడిపై చేసి పెట్టండి అంటూ కాస్త ఘాటుగా స్పందిస్తున్నారు.

Show comments