Jevon Searles: క్రికెట్లో మరో ఫిక్సింగ్ వివాదం.. KKR ఆటగాడిపై ఐసీసీ చర్య.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jevon Searles: వెస్టిండీస్ క్రికెట్ కు మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో దెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జేవోన్ సియర్ల్స్ పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చర్యలు తీసుకుంది. ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ ను ఉల్లంఘించినట్లు తేలడంతో అతన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. 2023-24 సీజన్లో బార్బడోస్ లో జరిగిన BIM10 లీగ్ టోర్నమెంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని ఐసీసీ వెల్లడించింది.
Annadata Sukhibhava 2026: రైతులకు ఉగాది కానుక.. నేడే ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధులు!
Also Read
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్‌ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
ఐసీసీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. జేవోన్ సియర్ల్స్ తోపాటు అతని జట్టుకు చెందిన ఇద్దరు అధికారులు కూడా అవినీతి కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలింది. జట్టు అధికారులు చితరంజన్ రాఠోడ్, ట్రెవాన్ గ్రిఫిత్ లను కూడా యాంటీ కరప్షన్ కోడ్ ఉల్లంఘనకు దోషులుగా గుర్తించి వారిపై కూడా నిషేధం విధించారు. ఈ కేసులో సియర్ల్స్ నాలుగు వేర్వేరు నిబంధనలను ఉల్లంఘించినట్లు ఐసీసీ తెలిపింది.
మ్యాచ్ ఫిక్సింగ్ కు సంబంధించిన అనుమానాస్పద ఆఫర్ల గురించి తన క్రికెట్ బోర్డుకు లేదా యాంటీ కరప్షన్ యూనిట్‌కు సమాచారం ఇవ్వలేదని సియర్ల్స్ పై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా.. అవినీతి సంబంధిత దర్యాప్తులో సహకరించకపోవడం, ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెట్టడం వంటి ఆరోపణలు కూడా అతనిపై ఉన్నాయి. ఈ ఆరోపణలపై సమాధానం ఇవ్వడానికి ఐసీసీ అతనికి 14 రోజుల గడువు ఇచ్చింది. ఆ గడువులో సరైన వివరణ ఇవ్వకపోతే అతనిపై నిషేధం పడే అవకాశం ఉంది.
Netanyahu: ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మృతి
39 ఏళ్ల జేవోన్ సియర్ల్స్ బార్బడోస్ కు చెందిన రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతను 9 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు సాధించాడు. లిస్ట్-A ఫార్మాట్లో 17 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసుకున్నాడు. టీ20 క్రికెట్లో 31 మ్యాచ్‌ల్లో 29 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 2018లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతను మూడు మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు తీశాడు.
తాజావార్తలు
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్‌ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..