ICC Player Of July Month Washington Sundar: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జూలై నెలలో ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ గా భారత ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను ఎంపిక చేసింది. గత నెలలో జరిగిన టీ 20 సిరీస్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అద్భుతాలు చేశాడు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ శ్రీలంక టూర్ లో టీమిండియాతో ఉన్నాడు. ఇక ఈ అవార్డుకు అతనితో పాటు.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు చెందిన గస్ అట్కిన్సన్, స్కాట్లాండ్ క్రికెట్ జట్టుకు చెందిన చార్లీ కాజిల్ కూడా నామినేట్ అయ్యారు.
CM Chandrababu: కలెక్టర్ల కాన్ఫరెన్స్.. క్లాస్ తీసుకున్న సీఎం చంద్రబాబు..
గత కొంతకాలంగా గాయాలతో పోరాడిన సుందర్ ఎట్టకేలకు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. గత నెలలో, అతను జింబాబ్వే క్రికెట్ జట్టుపై 5 మ్యాచ్‌ల్లో 11.62 సగటుతో 8 వికెట్లు తీశాడు. ఇక ఆ సిరీస్ లో అతని ఎకానమీ రేటు 6 (5.16) కంటే తక్కువగా ఉంది. జూలై నెలలో అతను శ్రీలంకతో ఒక టి 20 మ్యాచ్ కూడా ఆడాడు. అందులో అతను బ్యాటింగ్ లో 25 పరుగులు, అలాగే బౌలింగ్ లో 2 వికెట్లు తీసాడు.
CM and Deputy CM: పవన్ కల్యాణ్ చర్యలు తీసుకోవాలి.. సీఎం సూచన..