NTV Telugu Site icon

ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్‌ అంపైర్ల జాబితా ఇదే.. భారత్‌ నుంచి ‘ఒకే ఒక్కడు’!

Nitin Menon

Nitin Menon

Check Full List Of Umpires and Match Referees for ICC World Cup 2023: భారత గడ్డపై అక్టోబర్‌ 5 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం అన్ని టీమ్స్ తమ జట్లను ప్రకటించాయి. సెప్టెంబర్ 28 వరకు ముందుగా ప్రకటించిన జట్లలో మార్పులు చేసే అవకాశం అన్ని జట్లకు ఉంది. ఇక 16 మంది అంపైర్ల జాబితాను ఐసీసీ కూడా సోమవారం ప్రకటించింది. అంపైర్ల జాబితాలో భారత్‌ నుంచి ‘ఒకే ఒక్కడు’ చోటు సంపాదించాడు. అతడే నితిన్‌ మీనన్‌.

16 మంది అంపైర్ల జాబితాలో అత్యధికంగా ఇంగ్లండ్ నుంచి నలుగురికి చోటు దక్కింది. మైఖేల్‌ గాఫ్‌, రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌, రిచర్డ్‌ కెటిల్‌బోరో, అలెక్స్‌ వార్ఫ్‌లు ఇంగ్లీష్ అంపైర్లు. ఆస్ట్రేలియా నుంచి ముగ్గురికి (పాల్‌ రీఫిల్‌, రాడ్నీ టక్కర్‌, పాల్‌ విల్సన్‌) చోటు దక్కాగా.. న్యూజిలాండ్‌ (క్రిస్‌ బ్రౌన్‌, క్రిస్టోఫర్‌ గఫ్ఫానీ), దక్షిణాఫ్రికా (మరియాస్‌ ఎరాస్మస్‌, అడ్రియన్‌ హోల్డ్‌స్టాక్‌) నుంచి ఇద్దరికి అవకాశం వచ్చింది. శ్రీలంక (కుమార ధర్మసేన), భారత్ (నితిన్‌ మీనన్‌), పాకిస్తాన్‌ (ఎహసాన్‌ రజా), బంగ్లాదేశ్‌ (షర్ఫుద్దౌలా ఇబ్నే షహీద్‌), వెస్టిండీస్‌ (జోయెల్‌ విల్సన్‌)ల నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కింది.

వన్డే ప్రపంచకప్‌ 2023 కోసం నలుగురు రిఫరీల లిస్ట్‌ను కూడా ఐసీసీ విడుదల చేసింది. రిఫరీల్లో సైతం భారత్‌ నుంచి జవగల్‌ శ్రీనాథ్‌కు మాత్రమే అవకాశం దక్కింది. న్యూజిలాండ్‌ (జెఫ్‌ క్రో), జింబాబ్వే (ఆండీ పైక్రాఫ్ట్‌), వెస్టిండీస్‌ (రిచీ రిచర్డ్‌సన్‌)ల నుంచ్చి ఒక్కొక్కరికి రిఫరీల జాబితాలో చోటు లభించింది. ఇక టోర్నీ ఓపెనింగ్‌ మ్యాచ్‌కు భారత​ అంపైర్‌ నితిన్‌ మీనన్‌, శ్రీలంక మాజీ క్రికెటర్‌ కుమార ధర్మసేన ఫీల్డ్‌ అంపైర్లుగా వ్యవహరించనున్నారు.

అంపైర్ల జాబితా:
మైఖేల్‌ గాఫ్‌ (ఇంగ్లండ్‌)
రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ (ఇంగ్లండ్‌)
రిచర్డ్‌ కెటిల్‌బోరో (ఇంగ్లండ్‌)
అలెక్స్‌ వార్ఫ్‌ (ఇంగ్లండ్‌)
రాడ్నీ టక్కర్‌ (ఆస్ట్రేలియా)
పాల్‌ విల్సన్‌ (ఆస్ట్రేలియా)
పాల్‌ రీఫిల్‌ (ఆస్ట్రేలియా)
క్రిస్టోఫర్‌ గఫ్ఫానీ (న్యూజిలాండ్‌)
క్రిస్‌ బ్రౌన్‌ (న్యూజిలాండ్‌)
మరియాస్‌ ఎరాస్మస్‌ (దక్షిణాఫ్రికా)
అడ్రియన్‌ హోల్డ్‌స్టాక్‌ (దక్షిణాఫ్రికా)
నితిన్‌ మీనన్‌ (భారత్)
ఎహసాన్‌ రజా (పాకిస్తాన్‌)
కుమార ధర్మసేన (శ్రీలంక)
షర్ఫుద్దౌలా ఇబ్నే షహీద్‌ (బంగ్లాదేశ్‌)
జోయెల్‌ విల్సన్‌ (వెస్టిండీస్‌)

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

రిఫరీల జాబితా:
జవగల్‌ శ్రీనాథ్‌ (భారత్)
జెఫ్‌ క్రో (న్యూజిలాండ్‌)
రిచీ రిచర్డ్‌సన్‌ (వెస్టిండీస్‌)
ఆండీ పైక్రాఫ్ట్‌ (జింబాబ్వే)

Show comments