Site icon NTV Telugu

Rohit Sharma: కమ్ బ్యాక్ అంటే ఇది కదరా.. మొదటిసారి ‘టాప్’ లేపిన హిట్ మ్యాన్..!

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) విడుదల చేసిన తాజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. ఇది రోహిత్ కెరీర్‌లో తొలి సారి సాధించిన ఘనత. 38 ఏళ్ల 182 రోజుల వయస్సులో ఈ రికార్డును నెలకొల్పిన రోహిత్.. వన్డేల్లో నంబర్ 1 స్థానాన్ని సాధించిన అత్యంత పెద్ద వయస్కుడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. గత వారం వరకు అగ్రస్థానంలో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి నెట్టి రోహిత్ రెండు స్థానాలు ఎగబాకారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ అద్భుత ఫామ్‌ తో మ్యాన్ అఫ్ ది సిరీస్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 101 సగటుతో 202 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా అందుకున్నారు.

6.77 అంగుళాల FHD+ Super AMOLED స్క్రీన్, 50MP కెమెరా, IP54 రేటింగ్‌ తో Nothing Phone 3a Lite లాంచ్..!

ఈ అద్భుత ప్రదర్శనతో రోహిత్ ఆఫ్ఘనిస్తాన్‌ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్, టీమిండియా కెప్టెన్ గిల్‌ను అధిగమించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. గత దశాబ్ద కాలంగా టాప్ 10లో ఉన్నప్పటికీ ఇప్పుడు మొదటిసారి నంబర్ 1 ర్యాంక్ ను సాధించాడు. ఇతర భారత ఆటగాళ్లు సీషయానికి వస్తే.. అక్షర్ పటేల్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆరు స్థానాలు ఎగబాకి 31వ స్థానంలోకి, ఆల్‌రౌండర్ల జాబితాలో 8వ స్థానానికి చేరుకున్నారు. శ్రేయస్ అయ్యర్ ఒక స్థానం మెరుగుపరుచుకుని ప్రపంచ టాప్ 10లో 9వ స్థానాన్ని కొనసాగిస్తున్నారు. విరాట్ కోహ్లీ చివరి మ్యాచ్‌లో అద్భుతంగా ఆడినప్పటికీ, ఒక స్థానం తగ్గి 6వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం రోహిత్ శర్మకు 781 రేటింగ్ పాయింట్లు ఉండగా.. ఇబ్రహీం జద్రాన్ (764), శుభ్‌మన్ గిల్ (745) వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు. ఈ ర్యాంకింగ్ పాయింట్లు రోహిత్ కెరీర్‌లో అత్యధికం కావడం విశేషం. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌ల తర్వాత నంబర్ 1 వన్డే బ్యాటర్‌గా నిలిచిన ఐదవ భారత ఆటగాడిగా రోహిత్ రికార్డ్ సాధించాడు.

55dB ANC, 45 గంటల బ్యాటరీ లైఫ్, ప్రీమియం ఆడియో అనుభవంతో OPPO Enco X3s లాంచ్..!

Exit mobile version