ICC Rankings: ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ను టీమిండియా గెలిచిన సంగతి విధితమే. ఇక బిగ్ టోర్నమెంట్ ముగియడంతో ఐసీసీ (ICC) మహిళల వన్డే (ODI) ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ (Laura Wolvaardt) ప్రపంచకప్‌లో నెలకొల్పిన రికార్డు ప్రదర్శనతో ఏకంగా నెం.1 స్థానాన్ని కైవసం చేసుకుంది. టోర్నమెంట్‌కు ముందు అగ్రస్థానంలో ఉన్న భారత ఓపెనర్ స్మృతి మంధానను వోల్వార్ట్ అధిగమించి నెంబర్ 1 స్థానాన్ని అధిరోహించింది. భారత్‌లో జరిగిన ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో శతకాలు సాధించడంతో ఆమె అగ్రస్థానానికి చేరుకుంది.
Smartphones Price Hike: మొబైల్ ప్రియులకు భారీ షాక్.. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు పెరిగాయ్!
వోల్వార్ట్ ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం 571 పరుగులు సాధించింది. ఇది ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో ఒక క్రీడాకారిణి చేసిన అత్యధిక పరుగుల రికార్డు. ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా ఆమె రెండు స్థానాలు ఎగబాకి ఏకంగా 814 రేటింగ్స్ తో కెరీర్-హై ర్యాంక్‌ను అందుకుంది. దీనితో టీమిండియా ఓపెనర్, స్టార్ బాట్స్మెన్ స్మృతి మంధాన మొదటి స్థానాన్ని కోల్పోయి 811 పాయింట్స్ తో రెండో స్థాన్నైకి దిగజారింది. ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన వీరిద్దరూ ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’లో కూడా చోటు దక్కించుకున్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన ఎలీస్ పెర్రీ (Ellyse Perry) 77 పరుగుల ఇన్నింగ్స్‌తో టాప్-టెన్‌లోకి దూసుకొచ్చి, న్యూజిలాండ్‌కు చెందిన సోఫీ డివైన్‌తో కలిసి ఏడవ స్థానాన్ని (669) పంచుకున్నారు. ఇక మరో భారత క్రీడాకారిణి నవీ ముంబైలో ఆస్ట్రేలియాపై సెమీ-ఫైనల్‌లో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేసిన జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) కూడా టాప్-టెన్‌లోకి చేరుకుంది. అదే మ్యాచ్‌లో సెంచరీ సాధించిన ఆస్ట్రేలియా బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (Phoebe Litchfield) ఏకంగా 13 స్థానాలు ఎగబాకి.. 13వ స్థానానికి (637) చేరుకుంది.
Mobile Recharge : మొబైల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరగనున్న రీఛార్జ్ ధరలు..
ఇక మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 5 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ మారిజాన్ కాప్ (Marizanne Kapp), నెం.1 స్థానంలో ఉన్న సోఫీ ఎక్లెస్టోన్‌కు అత్యంత సమీపంలోకి చేరుకొని రెండో స్థానం సంపాదించింది. ఇక టీమిండియా అల్ రౌండర్ దీప్తి శర్మ మాత్రం ర్యాంకింగ్స్ లో ఎలాంటి చలనం లేకుండా 5వ స్థానంలో కొనసాగుతుంది. ఇక టాప్ టెన్ లో ఆస్ట్రేలియాకు చెందిన అనాబెల్ సదర్లాండ్ (ఆరవ స్థానం), కిమ్ గార్త్ (ఏడవ స్థానం) ఒక్కో స్థానం మెరుగుపరుచుకున్నారు. ఇక ప్రపంచకప్‌లోని రెండు నాకౌట్ మ్యాచ్‌లలో మూడు వికెట్లు తీసిన భారత బౌలర్ శ్రీ చరణి (Shree Charani) ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని 23వ స్థానానికి (511) చేరుకుంది.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దీప్తి శర్మ (Deepti Sharma) సెమీ-ఫైనల్, ఫైనల్‌లో మొత్తం ఏడు వికెట్లతో పాటు 82 పరుగులు సాధించి తన ఆల్ రౌండర్ ప్రతిభను మరోసారి చాటుకుంది. దీనితో ఆమె అల రౌరేంధేర్ జాబితాలో ఆమె ఒక స్థానం మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి (392) చేరుకుంది. ఈ ఆల్ రౌండర్ జాబితాలో ఆస్ట్రేలియా ప్లేయర్ ఆష్లీ గార్డనర్ 498 రేటింగ్స్ తో మొదటి స్థానంలో కొనసాగుతుంది.
