Site icon NTV Telugu

Haris Rauf ICC Ban: పాకిస్థాన్ ప్లేయర్ హరిస్ రవూఫ్‌కు ఐసీసీ షాక్.. సూర్యకు కూడా! ఎందుకో తెలుసా..

Haris Rauf Icc Ban

Haris Rauf Icc Ban

Haris Rauf ICC Ban: 2025 ఆసియా కప్‌లో భారతదేశం – పాకిస్థాన్ మధ్య ఫైనల్‌తో సహా మూడు మ్యాచ్‌లు జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వాస్తవానికి ఈ ఉత్రికత్తత పరిస్థితులను ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించింది. ఈక్రమంలో మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సమావేశం దుబాయ్‌లో జరిగింది. ఈ సమావేశంలో ఆసియా కప్ వివాదం కూడా చర్చకు వచ్చింది. చర్చ అనంతరం ఐసీసీ.. పాకిస్థాన్ ఆటగాడు హరిస్ రవూఫ్‌ను రెండు మ్యాచ్‌ల నిషేధనాన్ని విడించింది. అలాగే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించింది.

READ ALSO: PNB LBO Recruitment 2025: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్.. మీరూ ట్రై చేయండి

దుబాయ్‌లో జరిగిన ఈ సమావేశంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులపై ఐసిసి తన నిర్ణయాన్ని ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ , జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హరిస్ రౌఫ్, సాహిబ్‌జాదా ఫర్హాన్‌లతో సహా వివిధ మ్యాచ్‌లలో ఐదుగురు ఆటగాళ్లపై చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కేసులన్నీ సెప్టెంబర్ 2025లో ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మూడు మ్యాచ్‌లకు సంబంధించినవి. అంటే సెప్టెంబర్ 14, సెప్టెంబర్ 21, సెప్టెంబర్ 28 తేదీలలో జరిగినవి. ఈ కేసులను ఎమిరేట్స్ ICC ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీస్ సభ్యులు విచారించారు. అనంతరం ఐసీసీ పై విధంగా చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది.

అసలు ఏమైందంటే..
సెప్టెంబర్ 14, 2025: సెప్టెంబర్ 14న భారతదేశం – పాకిస్థాన్ మధ్య ఆసియా కప్‌లో తొలిసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మ్యాచ్ చుట్టూ ఉన్న వివాదాన్ని మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ విన్నారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21ని ఉల్లంఘించినందుకు సూర్యకుమార్ యాదవ్ దోషిగా తేలాడు. ఆయన చర్య ఆటకు చెడ్డ పేరు తెచ్చే ప్రవర్తనకు సంబంధించినది అని ఐసీసీ పేర్కొంది. అలాగే సూర్య మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాగా విధించడంతో పాటు, రెండు డీమెరిట్ పాయింట్లు విధించారు. ఇదే సమయంలో సాహిబ్‌జాదా ఫర్హాన్ (పాకిస్థాన్) కు అధికారిక హెచ్చరిక జారీ చేశారు. ఐసీసీ నిబంధనను ఉల్లంఘించినందుకు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. హారిస్ రౌఫ్ (పాకిస్థాన్) కూడా అదే ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలడంతో ఆయన మ్యాచ్ ఫీజులో కూడా 30 శాతం జరిమానా, రెండు డీమెరిట్ పాయింట్లు విధించారు.

సెప్టెంబర్ 21, 2025 : మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ మ్యాచ్‌ను విచారించారు. అర్ష్‌దీప్ సింగ్ (భారతదేశం)పై ఆర్టికల్ 2.6 కింద అభియోగం నమోదు అయ్యింది. ఇది అశ్లీల లేదా అభ్యంతరకరమైన హావభావాలకు సంబంధించినది. అయితే దర్యాప్తు తర్వాత అర్ష్‌దీప్ సింగ్ నిర్దోషి అని తేలడంతో ఆయనకు ఎటువంటి శిక్ష విధించలేదు. అయితే టోర్నమెంట్ ఫైనల్‌లో ఇద్దరు ఆటగాళ్లకు మాత్రం జరిమానా విధించారు. జస్‌ప్రీత్ బుమ్రా (భారతదేశం)పై ఆర్టికల్ 2.21 కింద అభియోగం నమోదు అయ్యింది. దీంతో బుమ్రాకు అధికారిక హెచ్చరికతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. ఈ మ్యాచ్‌లో హారిస్ రౌఫ్ (పాకిస్థాన్) మరోసారి అదే నిబంధనను ఉల్లంఘించినందుకు దోషిగా తేలాడు. రిచీ రిచర్డ్‌సన్ అధ్యక్షతన జరిగిన విచారణలో అతనికి మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా, మరోసారి రెండు అదనపు డీమెరిట్ పాయింట్లు విధించారు.

రవూఫ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం..
రవూఫ్ రెండుసార్లు దోషిగా తేలడంతో ఆయన మొత్తం డీమెరిట్ పాయింట్లు నాలుగుకు చేరుకున్నాయి. అలాగే అతనికి రెండు సస్పెన్షన్ పాయింట్లు రావడంతో ICC క్రమశిక్షణా చట్రం ప్రకారం.. రెండు మ్యాచ్‌ల నిషేధం విధించారు. దీంతో అతను నవంబర్ 4, 6వ తేదీలలో దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు ODIలు ఆడకుండా సస్పెండ్‌కు గురయ్యాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒక ఆటగాడికి 24 నెలల కాలంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు వస్తే, వాటిని సస్పెన్షన్ పాయింట్లుగా మారుస్తారు. రెండు సస్పెన్షన్ పాయింట్లు అంటే ఒక టెస్ట్ లేదా రెండు వన్డే/టీ20 మ్యాచ్‌ల నిషేధం. డీమెరిట్ పాయింట్లు 24 నెలల తర్వాత ముగుస్తాయి.

READ ALSO: Indian Business Icons: పతనం అంచున ఉన్న కంపెనీకి ప్రాణం పోశాడు.. : గోపీచంద్ హిందూజా

Exit mobile version