New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..

Icc New Country

Icc New Country

ఎడిన్‌బర్గ్ (స్కాట్లాండ్) వేదికగా జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వార్షిక సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆటను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఐసీసీ బోర్డు ఏకగ్రీవంగా మారిషస్‌ను తన 111వ సభ్య దేశంగా ఆమోదించింది. ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో పాలనాపరమైన సంస్కరణలతో పాటు ఆర్థిక సాయం, మరికొన్ని దేశాల సభ్యత్వంపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

గవర్నెన్స్ రివ్యూ కమిటీ ఏర్పాటు: ఐసీసీ సరికొత్త గవర్నెన్స్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇందులో డాక్టర్ మొహమ్మద్ మూసాజీ (దక్షిణాఫ్రికా), డాక్టర్ రోస్ రివాజ్ (ఐసీసీ స్వతంత్ర డైరెక్టర్) సభ్యులుగా ఉంటారు.

ఫ్రాంచైజీ లీగ్స్ కమిటీ: గ్లోబల్ టీ20 లీగ్‌లను పర్యవేక్షించేందుకు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ అధ్యక్షతన ఒక కొత్త కమిటీని నియమించారు.

ఆర్థిక సహాయం: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు బాసటగా నిలిచేందుకు ఐసీసీ బోర్డు 12.82 మిలియన్ యూఎస్ డాలర్ల (దాదాపు రూ.107 కోట్లు) రుణాన్ని మంజూరు చేసింది.

శ్రీలంక, కెనడాలపై నిర్ణయాలు: ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న కెనడా క్రికెట్ బోర్డు పునరుద్ధరణకు ఐసీసీ కఠిన నిబంధనలను విధించింది, అవి పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుంది. మరోవైపు శ్రీలంక క్రికెట్ బోర్డు ఐసీసీ సమావేశాలకు ప్రాతినిధ్యం వహించే అర్హతను ఇంకా సాధించలేదు.

ఫ్రాన్స్ క్రికెట్‌కు నోటీసులు: ఐసీసీ సభ్యత్వ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఫ్రాన్స్ క్రికెట్ అసోసియేషన్‌కు ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ తాజా మార్పులు , మారిషస్ చేరికతో ప్రపంచ క్రికెట్ పటంలో సరికొత్త దేశాలు భాగస్వామ్యం కానున్నాయి.