ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) IBPS PO, క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. నిర్ణీత తేదీలలోపు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఇప్పుడు సెప్టెంబర్ 28, 2025 లోపు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఆఫీసర్ స్కేల్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 13,217 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో (RRBలు) ఈ పోస్టులు భర్తీకానున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 28 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Also Read:మీ తలనొప్పి వెనుక దాగిన 10 ఆశ్చర్యకర కారణాలు
అర్హతలు:
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్.
ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్)- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్.
ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్) – గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్.
ఆఫీసర్ స్కేల్-II (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్)- కనీసం 50% మార్కులతో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ.
ఆఫీసర్ స్కేల్-II (చార్టర్డ్ అకౌంటెంట్) – ICAI ఇండియా నుంచి CA పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. CAగా ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
ఆఫీసర్ స్కేల్-II (లా ఆఫీసర్)- కనీసం 50% మార్కులతో లాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరర్) – CA లేదా MBA డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కాకుండా, 2 సంవత్సరాల అనుభవం కూడా అవసరం.
ఆఫీసర్ స్కేల్ II (మార్కెటింగ్ ఆఫీసర్) – 2 సంవత్సరాల అనుభవంతో మార్కెటింగ్ ట్రేడ్‌లో MBBS.
ఆఫీసర్ స్కేల్ II (అగ్రికల్చర్ ఆఫీసర్) – అగ్రికల్చర్, హార్టికల్చర్, డెయిరీ, యానిమల్, వెటర్నరీ సైన్స్, ఇంజనీరింగ్ లేదా ఫిజికల్చర్‌లో డిగ్రీ ఉండాలి.
ఆఫీసర్ స్కేల్ III (సీనియర్ మేనేజర్) – కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, అనుభవం అవసరం.
అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 18 నుంచి 40 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. IBPS RRB రిక్రూట్‌మెంట్ 2025 నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి సడలింపు కల్పిస్తారు. ఆఫీసర్ స్కేల్ (I, II, III), ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు రూ. 850 ఫీజు చెల్లించాలి. రిజర్వ్డ్ కేటగిరీల (SC, ST, PWD) అభ్యర్థులు రూ. 175 చెల్లించాలి.
అర్హత కలిగిన అభ్యర్థులకు మొదటగా ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ (PET) ఉంటుంది. దీనిని నవంబర్ 2025లో నిర్వహించవచ్చు. ప్రిలిమ్స్ పరీక్ష నవంబర్ లేదా డిసెంబర్ 2025లో జరుగుతుంది. దీనిలో అర్హత సాధించిన వారు మెయిన్స్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది (డిసెంబర్ 2025- ఫిబ్రవరి 2026). మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూ రౌండ్‌కు షార్ట్‌లిస్ట్ చేస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
Also Read:Tragedy: పాపం రా.. అన్నం తింటుండగా కూర వేయలేదని.. మహిళను గొడ్డలితో నరికి..
జీతం:
ఆఫీసర్ స్కేల్-I రూ. 60,000 నుంచి రూ. 61,000
ఆఫీసర్ స్కేల్-II రూ. 75,000 నుంచి రూ. 77,000
ఆఫీసర్ స్కేల్-III రూ. 80,000 నుంచి రూ. 90,000
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) రూ. 35,000 నుంచి రూ. 37,000
